Gidugu RudraRaju: రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు పీసీసీ మాజీ అధ్యక్షుడు, రాజమండ్రి లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు.. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పథకం ప్రకారం భౌతిక దాడులకు దిగుతుందని ఆరోపించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ అవసరమైతే రాజ్యాంగ సవరణ చేపడుతుందన్నారు. ప్రతి పేద మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయలు అందిస్తుందని వివరించారు. ఇక, బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందరేశ్వరి.. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతున్నారని విమర్శించారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లను రద్దు చేయాలని దుర్మార్గమైన ఆలోచనతో బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. భారతదేశంలో రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఇక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.. రాష్ట్రంలో దళితులపై వందల సంఖ్యలో దాడులు జరిగాయని, ముఖ్యమంత్రిపై జరిగిన దాడి భద్రతా వైఫల్యమే కారణమని అన్నారు రాజమండ్రి లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు.
Read Also: Cricket Betting: హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. రూ.2.5 కోట్లు సీజ్