NTV Telugu Site icon

Gidugu Rudra Raju: చంద్రబాబు, డీకే శివకుమార్‌ భేటీ.. గిడుగు ఆసక్తికర వ్యాఖ్యలు..

Gidugu Rudraraju

Gidugu Rudraraju

Gidugu Rudra Raju: టీడీపీ అధినేత చంద్రబాబుతో బెంగళూరు ఎయిర్ పోర్టులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మంతనాలు జరపడం ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. ఎయిర్‌పోర్ట్‌లో ఇరువురు ఎదురుపడడంతో మర్యాదపూర్వకంగా పలకరించుకున్నారు. ఆ తర్వాత పక్కకు వెళ్లి కాసేపు మాట్లాడుకున్నారు. అయితే, ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదని, ఇద్దరూ మర్యాదపూర్వకంగా మాట్లాడుకున్నారని టీడీపీ నేతలు చెబుతుండగా.. ఏపీసీసీ చీఫ్‌ గిడుగురు రుద్రరాజు మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు, డీకే శివ కుమార్ కి మధ్య చానాల్లుగా పరిచయం ఉందన్న ఆయన.. వాళ్లిద్దరూ ఖచ్చితంగా రాజకీయమే మాట్లాడుకుని ఉంటారు.. సినిమాల గురించి మాట్లాడుకోరు కదా ? అని ప్రశ్నించారు. అయితే, ఏం మాట్లాడారో తెలియదు, క్లారిటీ వచ్చాక దానిపై మాట్లాడుతా అన్నారు. రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు.. గత దీపావళికి చంద్రబాబునాకు కూడా గిఫ్ట్ పంపారు.. రాజకీయాల్లో పర్సనల్ రిలేషన్స్ వేరు, సిద్ధాంత పరమైన విధానాలు వేరు.. జగన్, చంద్రబాబు ఇద్దరు కూడా కాంగ్రెస్ నుంచి పాఠాలు నేర్చుకున్నవారేనని వ్యాఖ్యానించారు గిడుగు.

Read Also: MLC Kavitha: సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వండి.. కవిత డిమాండ్

ఇక, వైఎస్‌ షర్మిల.. ఏపీ కాంగ్రెస్ లోకి వస్తుందనే సమాచారం ఉందన్నారు గిడుగు.. ఆమెతోపాటు పార్టీలోకి వచ్చే వారి వివరాలు రానున్న రోజుల్లో తెలుస్తాయన్నారు. కొందరు నేతలు మాతో టచ్ లో ఉన్నారు అని గతంలో చెప్పాను.. పార్టీలో చేరికలపై ఢిల్లీలో ఒక బృందం నిర్ణయం తీసుకుంటుందన్నారు. షర్మిల పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ కోసం పని చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తారనే దానిపై నాకు సమాచారం లేదన్నారు.. కానీ, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని వెల్లడించారు ఏపీసీసీ చీఫ్‌ గిడుగురు రుద్రరాజు.