Site icon NTV Telugu

GHR Lakshmi Urban blocks: ది కాస్కేడ్స్ నియోపోలిస్‌.. 63 ఫ్లోర్లతో హైదరాబాదీలకు వరల్డ్ క్లాస్ అనుభూతి

Ghr Lakshmi Urban Blocks

Ghr Lakshmi Urban Blocks

గ్లోబల్ సిటీగా మారుతున్న హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ కు క్యూ కడుతున్నాయి. ఐటీ, ఫార్మా కంపెనీలకు హబ్‌గా ఉండటంతో పాటు ఓఆర్ఆర్, మెట్రో విస్తరణ, భారీ రింగ్ రోడ్, ఆహ్లాదకరమైన వాతావరణం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌‌కు బలమైన పునాదులు వేస్తున్నాయి. ప్రభుత్వం నగరంలో మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తుండడంతో స్థిరాస్తి వ్యాపారానికి అనుకూలంగా మారింది. శివార్లలో అత్యాధునిక వసతులతో కూడిన గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, వెంచర్లు వెలుస్తున్నాయి.

Also Read:Air India crash: ఎయిర్ ఇండియా ప్రమాదంలో కీలక పరిణామం.. బ్లాక్‌బాక్స్ డేటా డౌన్‌లోడ్..

నగరవాసులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు జీహెచ్ఆర్ ఇన్‌ఫ్రా, లక్ష్మీ ఇన్‌ఫ్రా, అర్బన్ బ్లాక్స్ రియాలిటీ ప్రమోటర్ల జాయింట్ వెంచర్ జీహెచ్ఆర్ లక్ష్మీ అర్బన్ బ్లాక్స్ ఇన్‌ఫ్రా సిద్ధమైంది. రూ.3,169 కోట్ల వ్యయంతో లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ‘ది కాస్కేడ్స్ నియోపోలిస్’ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 63 అంతస్తుల చొప్పున 5 టవర్లు, దాదాపు 217 మీటర్లతో ఎత్తుతో కూడిన ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్‌కే ఐకానిక్‌ ల్యాండ్ మార్క్ కానుంది. మార్చి 2030 నాటికి ఇది అందుబాటులోకి రానుంది.

Also Read:Air India crash: ఎయిర్ ఇండియా ప్రమాదంలో కీలక పరిణామం.. బ్లాక్‌బాక్స్ డేటా డౌన్‌లోడ్..

7.34 ఎకరాల విస్తీర్ణంలో విస్తీర్ణంలో 1189 ట్రిపుల్ బెడ్‌రూం, ఫోర్ బెడ్‌రూంలను నిర్మించనున్నారు. 2560 చదరపు అడుగుల నుంచి 4825 చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మిస్తున్నారు. 54వ అంతస్తులో ప్రైవేట్ పూల్స్, 10 స్పెషల్ పెంట్‌హౌస్‌లు ఉంటాయి. ఆరోగ్యం, ఆహ్లాదాన్ని అందిస్తూనే పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో నిర్మాణాలు జరుపుతున్నారు. లగ్జరీ, స్మార్ట్ లివింగ్ స్పేస్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను పరిష్కరించడానికి ఈ ప్రాజెక్ట్‌లో ప్రాధాన్యత కల్పించారు. 3 కోట్ల రూపాయల ప్రారంభ ధరను నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Exit mobile version