హైదరాబాద్ లో హెచ్ సిటీ క్రింద మరో ప్రాజెక్ట్ నిర్మాణం కాబోతోంది. రసూల్ పురాలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు కొత్త ఫ్లైఓవర్ నిర్మాణానికి జిహెచ్ఎంసి రెడీ అవుతోంది. వై ఆకారంలో ఫ్లైఓవర్ నిర్మించేందుకు డీపీఆర్ సిద్ధం చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు.. మెట్రో రైల్ కార్యాలయం వద్ద ప్రారంభమై ఒక రోడ్డు మినిస్టర్ రోడ్డు వైపు, మరొకటి పాటిగడ్డ వైపు వెళ్లే విధంగా నిర్మాణం చేయాలని భావిస్తోంది. 150 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లకు ఆహ్వానిస్తున్న జిహెచ్ఎంసి..
Also Read:Pakistan: లష్కరే తోయిబా హెడ్‌క్వార్టర్ పునర్నిర్మాణానికి పాకిస్తాన్ సాయం.. “సిందూర్”లో ధ్వంసం..
అందులో దాదాపు 70 కోట్లు ఆస్తుల సేకరణకు అంచనా వేస్తున్న జీహెచ్ఎంసి.. ఈపీసీ పద్ధతిలో ఈ ప్రాజెక్టును చేపట్టాలని జిహెచ్ఎంసి భావిస్తోంది. కొత్త ఫ్లై ఓవర్ నిర్మాణం కానుండడంతో వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. నగరంలో ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్ ఎంసీ మరో కొత్త ఫ్లై ఓవర్ ను నిర్మించబోతుండడంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
