గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) జి పుల్లారెడ్డి స్వీట్స్ సోమాజిగూడ బ్రాంచ్‌కు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ప్యాకేజింగ్‌కు ఉపయోగించినందుకు రూ.20,000 జరిమానా విధించింది. నిషేధం ఉన్నప్పటికీ అవుట్‌లెట్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తున్నారని సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి మరియు అదనపు పిసిసిఎఫ్ మోహన్ చంద్ర పర్గైన్ ఫిర్యాదు చేయడంతో అధికారులు పుల్లారెడ్డి వంటగదిని సందర్శించారు. “Dc-17 ఖైరతాబాద్ సర్కిల్ AMOH 17తో పాటు CM క్యాంపు కార్యాలయం సోమాజిగూడ సమీపంలో పుల్లారెడ్డి స్వీట్స్‌ను తనిఖీ చేసింది.
Also Read : Raja Singh : రాజాసింగ్ బతుకుతే ఎందీ? చస్తే ఏంది? అనే ఫీలింగ్‌లో కేసిఆర్ ఉన్నారు
సిబ్బంది వారి దుకాణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను కనుగొన్నారు. దీంతో రూ. 20,000 జరిమానా విధించారు మరియు భవిష్యత్తులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించకూడదని హెచ్చరించారు. అంతేకాకుండా తనిఖీలో దొరికిన ప్లాస్టిక్ కవర్లను GHMC స్వాధీనం చేసుకుంది,”అని అధికారులు తెలిపారు. గతంలో జి పుల్లారెడ్డి స్వీట్స్‌లో కొనుగోలు చేసిన స్వీట్స్ కుళ్లిపోయాయని వినియోగదారుడు ఫిర్యాదు చేయడంతో రూ.25 వేల జరిమానా విధించారు.
Also Read : Amigos: బాబాయ్ హిట్ పాటపై కన్నేసిన అబ్బాయ్.. ఆహా.. రొమాంటికే