NTV Telugu Site icon

GHMC : మేయర్ విజయలక్ష్మిపై బీజేపీ కార్పొరేటర్ల ఆగ్రహం.. ఆమె ప్రెస్ మీట్‌కే పరిమతమంటూ

Bjp

Bjp

అంబర్ పేట కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్‌ మరణించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై జీహెచ్‌ఎంసీ బీజేపీ కార్పొరేటర్‌లు మేయర్‌ విజయలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ప్రెస్ మీట్ కే పరిమితమని, కుక్కలకు సరిగ్గా ఫీడ్ చేయాలని ఉచిత సలహా ఇస్తారా? డాగ్ అడాప్షన్ చేసుకోవాలని సూచిస్తారా? అని బీజేపీ కార్పొరేటర్‌లు మండిపడ్డారు. అంతేకాకుండా.. ఆల్రెడీ కుక్కలు ప్రతి ఇంట్లో ఉన్నాయని, ఇంకెవరు అడాప్ట్ చేసుకుంటారు? కుక్కల నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అని వారు ప్రశ్నించారు. కుక్కలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని ఫోన్ వెళ్తే ఒక గల్లీ నుంచి మరో గల్లీలో కుక్కలను వదులుతున్నారన్నారు.

Also Read : Sajjala Ramakrishna Reddy: నిజమైన సంస్కరణలను తీసుకొచ్చింది సీఎం జగనే..

కుక్క కాటు వేస్తే వైద్యం అందించే దిక్కు లేదని, జనాభాకు సరిపడా వైద్యులు లేరన్నారు. బాలుడి మృతి బాధాకరమని, ప్రభుత్వం ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏం జరుగుతోందని, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై రివ్యూ పెట్టాలని కోరామన్నారు. అయినా స్పందించడం లేదని వారు విమర్శించారు. జీహెచ్‌ఎంసీలో అందరూ కమీషన్లకు అలవాటు పడిపోయారని, బినామీలు విధులు చేపడుతున్నారు(ఒకరికి బదులు మరొకరు) అని వారు ఆరోపించారు. రీ ప్రొడక్టివిటీకి వచ్చే డబ్బులు కూడా అధికారులు దోచుకున్నారని, జీహెచ్‌ఎంసీని కేటీఆర్, కవిత, సంతోష్ రావు చేతుల్లో పెట్టారని, ప్రగతి భవన్, లేదా దారుస్సలాం నుంచి ఆర్డర్ వస్తే కానీ ఏ పని జరగదని వారు వ్యాఖ్యానించారు.

Also Read : Mahesh Babu: దైవం మానుష రూపేణ…

Show comments