Site icon NTV Telugu

GHMC : జీహెచ్‌ఎంసీ బార్లకు దరఖాస్తుల వెల్లువ.. మరో మూడు రోజులే గడువు

Liquor

Liquor

GHMC : జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 బార్లకు మిగిలిన మూడు రోజుల వ్యవధిలో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పీ. దశరథ్ తెలిపారు. నాంపల్లి కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఇటీవల రూరల్ ప్రాంతాల్లో బార్లకు అనూహ్యంగా అధిక దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. మొత్తంగా జీహెచ్‌ఎంసీతో కలిపి 28 బార్లకు పునరుద్ధరణ కోసం దరఖాస్తులను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 బార్లకు 356 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. రూరల్ బార్ల కంటే ఎక్కువగా జీహెచ్‌ఎంసీలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Elon Musk: ట్రంప్ సర్కార్‌పై మస్క్ వ్యతిరేక గళం.. ట్యాక్స్‌ బిల్లుపై విమర్శలు

దరఖాస్తుల గడువు ఈ నెల 6వ తేదీ వరకూ ఉంటుందని స్పష్టం చేశారు. గత నెలలో రూరల్ పరిధిలో జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా 25 బార్లకు 1346 దరఖాస్తులు వచ్చాయని, ఈ దరఖాస్తుల ద్వారా ఎక్సైజ్ శాఖకు రూ.13.46 కోట్ల ఆదాయం లభించిందని చెప్పారు. మిగిలిన మూడు రోజుల్లో 3,000 నుండి 5,000 దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 బార్లతో పాటు, సరూర్‌నగర్‌, జాల్‌పల్లి, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, బోధన్‌లో ఒక్కొక్క బార్‌కు కూడా దరఖాస్తులను ఆహ్వానించినట్లు తెలిపారు.

MLC Kavitha : నేడు ఇందిరాపార్క్‌ దగ్గర తెలంగాణ జాగృతి ధర్నా

Exit mobile version