Site icon NTV Telugu

SS. Rajamouli : SSMB29.. నేడే పృథ్వీరాజ్‌ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్

Ssmb 29

Ssmb 29

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ బ్యూటీ ప్రియింక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌  సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. SSMB29 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేందుకు #GlobeTrotter పేరోతో ఈ నెల 15న హైదరాబాద్ లోని రామోజీఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో సినిమా టైటిల్ తో పాటు వీడియో గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

Also Read : SK : శివకార్తికేయన్, శ్రీలీల, సుధాకొంగర, జయం రవికి పెను సవాల్ గా మారిన ‘పరాశక్తి’

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబందించి కీలక అప్డేట్ ఇచ్చాడు దర్శక ధీరుడు రాజమౌళి. అయన ఎక్స్ ఖాతాలో ‘ మహేశ్, పృథ్వీరాజ్‌, ప్రియాంక చోప్రాలపై భారీ సెట్స్ మధ్యలో క్లైమాక్స్ షూట్ జరుగుతోంది. అదే సమయంలో, #GlobeTrotter ఈవెంట్ కు గ్రాండ్ గా నిర్వహించేందుకు చాలా సన్నాహాలు జరుగుతున్నాయి, ఎందుకంటే మేము ఇంతకు ముందు చేసిన దానికంటే ఇప్ప్పుడు చేయబోయే ఈవెంట్ ను భారీ ఎత్తున చేసేందుకు ప్రయత్నిస్తున్నాము.నవంబర్ 15న మీరు ఊహించిన దానికి మించి ఉంటుంది. మీరు అప్పటివరకు ఆగలేరు అని తెలుసు అందుకే మీ అందరి కోసం మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వాలని నిర్ణయించాను. అందుకే పృథ్వీరాజ్‌ సుకుమారన్ ఫస్ట్ లుక్ ను ఈ రోజు రిలీజ్ చేయబోతున్నాను’ అని ట్వీట్ చేశారు రాజమౌళి. కాగా ఈ సినిమాకు ‘వారణాసి’ అనే ఫిక్స్ చేసారు మేకర్స్.

Exit mobile version