NTV Telugu Site icon

Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్‌లో బంపరాఫర్‌.. 83 వేల ఫోన్ 43 వేలకే! బ్యాంకు ఆఫర్స్ అదనం

Google Pixel 8 Flipkart Discount

Google Pixel 8 Flipkart Discount

దీపావళి పండగ సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్‌’ మరో సేల్‌ను తీసుకొచ్చింది. ‘బిగ్‌ దీపావళి సేల్‌’ 2024 సేల్‌ను ఇటీవలే ప్రకటించింది. అక్టోబర్‌ 21 నుంచి ఈ సేల్‌ ఆరంభమైంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై భారీ ఎత్తున ఆఫర్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లలో ‘గూగుల్‌ పిక్సెల్‌’ స్మార్ట్‌ఫోన్స్ అయితే సగం ధరకే అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు బ్యాంకు ఆఫర్స్, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్స్ అదనం. ఆ డీటెయిల్స్ చూద్దాం.

ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్‌ పిక్సెల్‌ 8 స్మార్ట్‌ఫోన్‌ 8జీబీ+256జీబీ వేరియెంట్ అసలు ధర రూ.82,999గా ఉంది. బిగ్‌ దీపావళి సేల్‌ సందర్భంగా ఈ ఫోన్‌పై 48 శాతం తగ్గింపు ఉంది. తగ్గింపు అనంతరం రూ.42,999కి గూగుల్‌ పిక్సెల్‌ 8 సొంతం చేసుకోవచ్చు. ఎస్‌బీఐ బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. అప్పుడు అదనంగా మరో 4,300 తగ్గింపు అనంతరం రూ.38,600కు లభిస్తుంది. ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్స్ కూడా ఉంది. ఈ ఫోన్ మరో కలర్‌ వేరియంట్‌ను రూ.36,499కి కొనుగోలు చేయవచ్చు.

Also Read: Prithvi Shaw: పృథ్వీ షాపై వేటు.. ఇక కెరీర్‌ క్లోజ్ అయినట్టే?

గూగుల్‌ పిక్సెల్‌ 8 ఫీచర్స్:
# 6.2 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
# టెన్సర్ G3 ప్రాసెసర్
# 90Hz రిఫ్రెష్ రేట్
# ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌
# 50 ఎంపీ పీడీ వైడ్‌ ప్రైమరీ సెన్సర్‌, 12 ఎంపీ అల్ట్రావైడ్‌ కెమెరా
# 10.5 ఎంపీ సెల్ఫీ కెమెరా
# 4575 ఎంఏహెచ్‌ బ్యాటరీ (క్యూఐ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌)

 

Show comments