Site icon NTV Telugu

Germany: ఇరాన్‌ నుంచి విమానానికి బెదిరింపు.. రాకపోకలను నిలిపివేసిన హాంబర్గ్ ఎయిర్‌పోర్టు!

Germany

Germany

Germany: జర్మనీలోని హాంబర్గ్ విమానాశ్రయం ఇరాన్ నుంచి వచ్చిన విమానానికి బెదిరింపు రావడంతో సోమవారం అన్ని విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌ను నిలిపివేసింది. కొన్ని గంటల తర్వాత బెదిరింపుకు ప్రతిస్పందనగా పోలీసు ఆపరేషన్ తర్వాత ఎయిర్‌పోర్టు తిరిగి కార్యకలాపాలను ప్రారంభించింది. పోలీసు చర్యల కారణంగా ఎలాంటి టేకాఫ్‌లు లేదా ల్యాండింగ్‌లు జరగడం లేదని విమానాశ్రయం తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

Also Read: Japan: ఎస్కలేటర్లపై నడవడాన్ని నిషేధించిన జపాన్..కారణం ఏంటో తెలుసా?

కొన్ని గంటల అనంతరం జర్మనీలోని హాంబర్గ్ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ పునఃప్రారంభించబడింది. ఇరాన్ నుంచి వచ్చిన విమానానికి బెదిరింపు నేపథ్యంలో పోలీసు ఆపరేషన్‌ నిర్వహించినట్లు ఎయిర్‌పోర్టు ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈమెయిల్‌ ద్వారా పంపబడిన దాడి బెదిరింపుతో అధికారులు ఉత్తర జర్మన్ నగరం హాంబర్గ్‌లో 198 మంది ప్రయాణికులతో టెహ్రాన్‌ నుంచి వచ్చిన విమానాన్ని శోధించారు. బాంబు బెదిరింపు కారణంగా బెర్లిన్‌కు తూర్పుగా ఉన్న జర్మన్ గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత విమానాన్ని ఎస్కార్ట్ చేసినట్లు జర్మన్ వైమానిక దళం తన X సోషల్ మీడియా ఖాతాలో తెలిపింది.

Also Read: Rajasthan Assembly Polls: బీజేపీ తొలి జాబితా విడుదల.. మాజీ సీఎం విధేయులకు దక్కని చోటు!

పోలీసులు ప్రయాణికులను ప్రశ్నించారు. ముప్పు తీవ్రంగా ఉన్నప్పుడు ఇలా చేయడం సాధారణమే అని పోలీసు అధికారి పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్ అగ్నిమాపక దళం శోధనలో నిమగ్నమై ఉన్నందున టేకాఫ్‌లు లేదా ల్యాండింగ్‌లు సాధ్యం కాలేదని అధికార ప్రతినిధి తెలిపారు.హాంబర్గ్‌లో జర్మన్, ఫ్రెంచ్ ప్రభుత్వాల ప్రత్యేక సమావేశానికి ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇద్దరూ హాజరైన మొదటి రోజున ఈ వార్త రావడం గమనార్హం.

Exit mobile version