Berlin Bomb Scare: జర్మనీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది.. బెర్లిన్ పరిధిలోని మిట్టే జిల్లాలో గురువారం సాయంత్రం స్ప్రీ నది నుంచి రెండవ ప్రపంచ యుద్ధం నాటి పేలని బాంబును అధికారులు బయటికి తీశారు. ఈ బాంబు గత 80 ఏళ్లుగా పేలలేదు. బాంబును గుర్తించిన వెంటనే పోలీసులు 500 మీటర్ల పరిధిలో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి, దాదాపు 10 వేల మందిని అక్కడి నుంచి ఖాళీ చేయమని ఆదేశించారు.
READ ALSO: Jr NTR Injured: ఎన్టీఆర్‌కు గాయాలు.. షాక్ లో ఫాన్స్!
అసలు ఏంటీ బాంబు కథ..
పలు నివేదికల ప్రకారం.. మిట్టే జిల్లాలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పోలీసులు అకస్మాత్తుగా ప్రజల తలుపులు తట్టడం ప్రారంభించారు. వెంటనే ప్రజలను వారి ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. వాళ్లందరిని మిట్టే టౌన్ హాల్‌కు తరలించారు. అసలు ఏం జరిగిందంటే.. జిల్లాలో గురువారం సాయంత్రం స్ప్రీ నది నుంచి రెండవ ప్రపంచ యుద్ధం నాటి పేలని బాంబును అధికారులు బయటికి తీశారు. నదిలో నాలుగు మీటర్ల లోతులో బాంబు కనిపించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన అధికారులు వెంటనే స్థానికులను వారి ఇండ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
గురువారం రాత్రి భయం, ఆందోళనతో గడిపిన ప్రజలకు శుక్రవారం ఉదయం కొంత ఉపశమనం లభించింది. బాంబును నిర్వీర్యం చేయవలసిన అవసరం లేదని పోలీసులు ప్రకటించారు. పలు నివేదికల ప్రకారం.. బాంబు స్ప్రీ నదిలో నాలుగు మీటర్ల లోతులో బురదలో పాతుకుపోయి కనిపించింది. ఇది ఆపరేషన్‌కు ఆటంకం కలిగించిందని అధికారులు చెప్పారు. అధికారుల నుంచి స్పష్టమైన సంకేతం రాగానే ప్రజలు తమ ఇళ్లకు తిరిగి వెళ్లడానికి అనుమతించారు. ఇటీవల సంవత్సరాలలో బెర్లిన్‌లో జరిగిన అతిపెద్ద బాంబు తొలగింపు కార్యకలాపాలలో ఇది ఒకటిగా నిలిచింది.
నేడు స్పాండౌలో..
బెర్లిన్‌లోని స్పాండౌ జిల్లాలో బుధవారం దొరికిన మరో 100 కిలోల రెండవ ప్రపంచ యుద్ధ బాంబును నేడు (శుక్రవారం) నిర్వీర్యం చేస్తారని అధికారులు తెలిపారు. జిల్లాలో అధికారులు భద్రతా వలయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే సమీపంలోని జిమ్‌ను స్థానిక ప్రజలకు సురక్షిత ఆశ్రయంగా మార్చినట్లు పేర్కొన్నారు. ఆ ప్రాంతం నుంచి దాదాపు 12,400 మందిని తరలించినట్లు పోలీసులు తెలిపారు.
READ ALSO: Scuba Death: సింగర్ ప్రాణాలు తీసిన స్కూబా డైవింగ్..