Site icon NTV Telugu

German Railway: జర్మనీలో ట్రైన్స్ నిలిపివేత.. ధర్నాకు దిగిన లోకో ఫైలెట్స్

Germany

Germany

జర్మనీలో రైలు డ్రైవర్ల సమ్మెకు దిగారు. లోకో ఫైలెట్స్ జీతాల పెంపు కోసం వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న జీడీఎల్ యూనియన్ గురువారం రాత్రి 24 గంటల సమ్మెను ప్రారంభించింది. దీని తర్వాత జర్మనీ అంతటా రైలు వ్యవస్థ స్థంబించిపోయింది. ఈ సందర్భంగా.. జర్మన్ రైల్వే డ్యుయిష్ బాన్ తన తమ రైళ్లలో 20 శాతం మాత్రమే నడుస్తున్నాయని తెలిపింది. అయితే వీలైన చోట అనవసర ప్రయాణాన్ని ఆలస్యం చేయమని వినియోగదారులను చెప్పారు. ఈ వారం ప్రారంభంలో మంచు తుఫాన్ కారణంగా మ్యూనిచ్, దక్షిణ జర్మనీలోని కొన్ని ప్రాంతాల్లో రవాణాకు అంతరాయం ఏర్పడింది.

Read Also: Telangana Assembly Session: రాజ్‌భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన అక్బరుద్దీన్

ఇక, రెండు రౌండ్ల చర్చల తర్వాత జీడీఎల్, డ్యుయిష్ బాన్ మధ్య చర్చలు విఫలమైన తర్వాత ఈ సమ్మె జరుగుతుంది. జీడీఎల్ జీతాల పెంపు, ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు ఒకేసారి మొత్తం చెల్లింపుతో పాటు వారంతపు పని గంటలను 38 నుంచి 35గంటలకి తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. 11 శాతం పెరుగుదలకు సమానమైన ఆఫర్‌ను అందించినట్లు డ్యూయిష్ బాన్ తెలిపింది. ఈ ఏడాది నవంబర్ 16న 20 గంటల పాటు సమ్మెను చేశారు. దీంతో డ్యుయిష్ బాన్ కూడా సుదూర ప్రాంతాల దూరాన్ని తగ్గించింది.

Read Also: Salaar: సరిగ్గా రెండు వారాల్లో బాక్సాఫీస్ పై దాడి చేయనున్న డైనోసర్…

అయితే, ఈ సమ్మె ఈ సంవత్సరం జీడీఎల్ యొక్క చివరి సమ్మె అవుతుందని జర్మన్ రైల్వే అధికారులు భావిస్తున్నారు. అయితే యూనియన్ త్వరలో తన చర్యను విస్తరించవచ్చు.. జీడీఎల్ ఛైర్మన్ క్లాస్ వెసెల్స్కీ జర్మన్ రేడియో స్టేషన్ బేరిస్చెర్ రండ్‌ఫంక్‌తో మాట్లాడుతూ.. ఒప్పందం కుదరకపోతే సమ్మెలు 2024 నాటికి పెద్ద ఎత్తున ఆందోళనలు చేసే అవకాశం ఉందని తెలిపారు.

Exit mobile version