Site icon NTV Telugu

India Economy: భారత డిజిటల్ ఆర్థికవ్యవస్థను మార్చుతున్న Gen Z.. ఎక్కువగా దేనికి ఖర్చు చేస్తున్నారంటే..?

India Economy Gen Z

India Economy Gen Z

India Economy Gen Z: భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటి వరకు చూడని తరహా మార్పును చూస్తోంది. ఖర్చులు ఎలా చేయాలి..? ఎలా సేవ్‌ చేసుకోవాలి..? క్రెడిట్‌ను ఎలా వినియోగించాలి..? అనే దానిపై దేశ యువత తమదైన ముద్ర వేస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ మద్దతుతో పనిచేస్తున్న యువతకు అనుగుణమైన UPI ఫింటెక్ ప్లాట్‌ఫారమ్ సూపర్ మనీ (Super Money) విడుదల చేసిన తొలి వార్షిక వినియోగదారుల అధ్యయనం ‘superSpends 2025’ ఈ పరిస్థితిని స్పష్టంగా చూపిస్తోంది. దేశవ్యాప్తంగా మిలియన్ల లావాదేవీల డేటాను విశ్లేషించిన ఈ రిపోర్ట్ Gen Z ఎలా కొత్త ఫైనాన్షియల్ కల్చర్‌ను నిర్మిస్తున్నారో వివరిస్తోంది.

Local Body Elections Live Updates: కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌

Super Money వినియోగదారుల్లో 72% మంది 30 ఏళ్ల లోపు వారు. ఈ వయసు వర్గం భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల పెరుగుదలకి ప్రధాన ఇంధనంగా నిలుస్తోంది. వీరి కోసం పేమెంట్లు కేవలం లావాదేవీలు మాత్రమే కాదు. వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలుగా మారాయి. ప్రతీ లావాదేవీని క్యాష్ బ్యాక్ రూపంలో ‘ఖర్చు + సంపాదన’ అవకాశంగా చూడటం, అందరికీ కొత్త మార్గాన్ని చూపుతోంది. ఇందులో భాగంగా రోజువారీ చెల్లింపుల సంఖ్య గతంలో లేనంతగా పెరిగింది. వినియోగదారులు నెలకు 50కి పైగా చెల్లింపులు చేస్తుండగా, కొంతమంది నెలకు 200కి పైగా లావాదేవీలు నమోదు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య గ్రోసరీ కొనుగోళ్లు, సాయంత్రం 6 నుంచి 11 గంటల మధ్య డైనింగ్, ఫుడ్ ఆర్డర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి తర్వాత ఫాస్ట్‌ఫుడ్ ఆర్డర్లు పీక్‌ చేరడం యువత జీవనశైలిలో వచ్చిన మార్పును సూచిస్తోంది.

Big Breaking : అఖండ 2 పై తెలంగాణ హై కోర్టులో పిటిషన్.. ప్రీమియర్స్ పై ఉత్కంఠ

మెట్రోలకు మాత్రమే పరిమితమైన డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. క్రెడిట్ వినియోగంలో కూడా యువత నూతన ధోరణులు కనబరుస్తున్నారు. Super Money వినియోగదారుల్లో 45 శాతం మంది తొలి సారి క్రెడిట్ తీసుకుంటున్నవారే. వీరిలో చాలామంది FD బ్యాక్డ్ సెక్యూర్డ్ కార్డులను ఎంచుకోవడం, సురక్షితమైన కానీ నమ్మకమైన క్రెడిట్ కల్చర్ వైపు వెళ్తున్నారన్నదానికి నిదర్శనం.

Exit mobile version