Geethu Mohandas : “నేను చిల్ అవుతున్న” అంటూ.. టాక్సిక్ రచ్చకు గీతూ మోహన్‌దాస్ బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాకింగ్ స్టార్ యష్ హీరోగా వస్తున్న ‘టాక్సిక్’ టీజర్‌లోని ఒక శృంగార సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్న సంగతి తెలిసిందే. ఒక మహిళా దర్శకురాలై ఉండి ఇంత బోల్డ్ సీన్ ఎలా తీశారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తుండగా, గీతూ మోహన్‌దాస్ తాజాగా సెటైరికల్‌గా స్పందించారు. ‘స్త్రీల ఆనందం, వారి సమ్మతి గురించి జనం ఇంకా చర్చించుకుంటూనే ఉన్నారు.. నేను మాత్రం చిల్ అవుతున్నాను’ అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఘాటుగా బదులిచ్చారు. ఆ సీన్ కేవలం శృంగారం మాత్రమే కాదని, అది స్త్రీల స్వేచ్ఛకు మరియు వారి మనోభావాలకు అద్దం పట్టే అంశమని ఆమె పరోక్షంగా పేర్కొన్నారు. అలాగే ఆ సన్నివేశంలో ఉన్న నటి పేరు బీట్రిస్ బాచ్ అని, ఆమెను తన ‘సిమెట్రీ గర్ల్’ అని గీతూ పరిచయం చేశారు.
Also Read : Amitabh Bachchan: బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కు తప్పిన ప్రమాదం.. ఎయిర్‌పోర్ట్‌లో పగిలిన అద్దాలు!
Also Read
- AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
- Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
- Weather Forecast: అండమాన్ సమీపంలో నైరుతి రుతుపవనాలు.. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు!
- Emmanuel Macron: నటి మెసేజ్‌లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌కు భార్య చెంపదెబ్బ!
అయితే గీతూ మోహన్‌దాస్ స్పందనపై సోషల్ మీడియాలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో సినిమాల్లో మహిళలను అశ్లీలంగా చూపించడంపై పోరాడిన గీతూ, ఇప్పుడు తన సినిమాలో ఇలాంటి దృశ్యాలు పెట్టడం ఏంటీ? అంటే దీని బట్టి ఆమె ‘ద్వంద్వ వైఖరి’కి నిదర్శనమని కొందరు విమర్శిస్తున్నారు.. ‘వేరే వాళ్ళు తీస్తే బూతు.. మీరు తీస్తే సినిమానా?’ అంటూ కొందరు యూట్యూబర్లు.. అలాగే నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, రాంగోపాల్ వర్మ వంటి వారు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుండగా, ఇది ‘పెద్దల కోసం తీసిన కథ (A Fairy Tale for Grown-Ups)’ అని, అందుకే ఇలాంటి సీన్స్ తప్పవని ఆమె అభిమానులు సమర్థిస్తున్నారు. ఏదేమైనా, ఈ వివాదం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
తాజావార్తలు
-
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
-
Akash Ambani: జియో సామ్రాజ్యానికి కొత్త బాస్.. అంబానీ వారసుడి చేతికి జియో ప్లాట్‌ఫామ్స్ పగ్గాలు!
-
Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
-
Weather Forecast: అండమాన్ సమీపంలో నైరుతి రుతుపవనాలు.. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు!
-
Emmanuel Macron: నటి మెసేజ్‌లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌కు భార్య చెంపదెబ్బ!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?