NTV Telugu Site icon

Geetha Reddy : 30 నియోజకవర్గాల్లో భట్టి పాదయాత్ర చిన్న విషయం కాదు

Geetha Reddy

Geetha Reddy

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. నేడు పాదయాత్రలో భట్టి విక్రమార్క 1000 కిలో మీటర్ల మైలురాయిని దాటారు. దీనిపై పార్టీ నేతలు అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి గీతా రెడ్డి మాట్లాడుతూ.. మార్చి 16న ఆదిలాబాద్‌ జిల్లాలోని బోథ్‌ నుంచి భట్టి విక్రమార్క ప్రారంభించిన పాదయాత్ర 1000 కిలోమీటర్ల మైలురాయిని విజయవంతంగా పూర్తి చేసుకోవడం పట్ల భట్టి విక్రమార్కకు ఆమె అభినందనలు తెలిపారు.

Also Read : Bihar BJP chief: “బిన్ లాడెన్ లాగా గడ్డం పెంచుకుంటారు”.. రాహుల్ గాంధీపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

అంతేకాకుండా.. దాదాపు 500 గ్రాములు, 30 నియోజకవర్గాల్లో భట్టి పాదయాత్ర చేశారని, ఇది మామూలు విషయం కాదన్నారు. పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేస్తున్నారని, ఆయన వెంట మేము కూడా ఉన్నామన్నారు. పాదయాత్రలో భట్టి విక్రమార్క సామన్య కార్యకర్తలతో టెంట్‌లలోనే ఉంటున్నారని, ఎండావాన లెక్కచేయకుండా ఆయన పాదయాత్రకు కొనసాగిస్తున్నారన్నారు. కర్ణాటకలో గెలిచిన విధంగానే తెలంగాణలోనూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆమె అన్నారు. ఈ పాదయాత్రలో ఈ నెలాఖరు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ పాల్గొంటారని ఆమె అన్నారు.

Also Read : Danam Nagender : రేవంత్ రెడ్డిని ఓడించి బంగాళాఖాతంలో కలపడం తప్పదు