Site icon NTV Telugu

GBS Outbreak: ఏపీలో పెరుగుతున్న జీబీఎస్ కేసులు.. లక్ష మందిలో ఒక్కరికి మాత్రమే సోకే అరుదైన వ్యాధి!

Gbs Outbreak

Gbs Outbreak

ఏపీలో గులియన్‌-బారీ సిండ్రోమ్‌ (జీబీఎస్‌) కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 17 జీబీఎస్‌ కేసులు నమోదయ్యాయి. ఇంకా కొన్ని చోట్ల కేసులు పెరుగుతున్నాయి. ఆరు జిల్లాల్లో జీబీఎస్ కేసులు నమోదయినట్టు అధికారులు గుర్తించారు. విజయనగరం, విజయవాడ, అనంతపురంలో ఒక్కో కేసు చొప్పున.. కాకినాడలో 4, గుంటూరు మరియు విశాఖలలో 5 చోప్పున జీబీఎస్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నరాల సంబంధిత వ్యాధి కేసులు రాష్ట్రంలో ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

లక్ష మందిలో ఒక్కరికి మాత్రమే సోకే అత్యంత అరుదైన వ్యాధిగా జీబీఎస్ సిండ్రోమ్ గుర్తించబడింది. రోగనిరోధక శక్తిని జీబీఎస్ సిండ్రోమ్ నశింపజేస్తుంది. అతిగా ఇన్ఫెక్షన్లు, వాక్సిన్‌లు, సర్జరీలు, ట్రామా, జన్యుపరంగానూ జీబీఎస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కండరాల బలహీనత, తిమ్మిరి, నడవలేకపోవటం, మింగలేకపోవటం, శ్వాస ఆడకపోవటం లాంటివి ఈ జీబీఎస్ వ్యాధి లక్షణాలు. ఇంట్రా వీనస్ ఇమ్యూనో గ్లోబిన్ ఇంజెక్షన్ చేయించుకోవాలని వైద్యారోగ్యశాఖ సూచింస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల వ్యాక్సీన్లను అందుబాటులో ఉంచినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఎన్టీఆర్ వైద్య సేవకింద ఉచిత చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. జీబీఎస్ బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఈ ఇంజెక్షన్లను తీసుకోకుండానే 80 శాతం మంది రికవరీ అయ్యారని వెల్లడించింది. జీబీఎస్ కేసులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

Exit mobile version