NTV Telugu Site icon

World Cup 2023: భారత్ బాగా ఆడలేదు.. నిజం ఒప్పుకోవాల్సిందే: గౌతమ్ గంభీర్

Gautam Gambhir

Gautam Gambhir

Gautam Gambhir React on India Defeat in World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్‌ 2023లో ఓటమి లేకుండా ఫైనల్‌ చేరిన భారత్.. చివరి మెట్టుపై బోల్తా పడింది. ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి టైటిల్ సాధించే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ టైటిల్ గెలవడంపై పలువురు భారత మాజీ ఆటగాళ్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అత్యుత్తమ జట్టుకు ప్రపంచకప్‌ దక్కలేదని మాజీ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌తో పాటు మరికొంతమంది అభిప్రాయపడ్డారు. ఈ వాదనను మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. ఇది వింత వాదన అని, అత్యుత్తమ జట్టే ప్రపంచకప్‌ గెలిచిందన్నాడు. ఫైనల్‌లో భారత్ బాగా ఆడలేదన్న నిజం ఒప్పుకోవాల్సిందే అని గౌతీ అన్నాడు.

స్పోర్ట్స్‌కీడాతో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ… ‘చాలా మందికి నేను చెప్పేది నచ్చకపోవచ్చు. అత్యుత్తమ జట్టు ప్రపంచకప్ 2023 గెలవలేదని కొంతమంది అంటున్నారు. అది వాస్తవం కాదు. వాస్తవానికి అత్యుత్తమ జట్టే ప్రపంచకప్ గెలిచింది. నిజాయితీగా మాట్లాడితే.. భారత్ 10 మ్యాచ్‌లు గెలిచి చాలా మంచి ఫామ్‌లో ఉంది. కాబట్టి ఫైనల్‌లో ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఆస్ట్రేలియా మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడి వరుసగా ఎనిమిది విజయాలు సాధించింది. అత్యుత్తమ జట్టు మాత్రమే ప్రపంచకప్‌ను గెలుస్తుంది’ అని అన్నాడు.

Also Read: Amelia Kerr Towel: టవల్‌తో బంతిని ఆపింది.. భారీ మూల్యం చెల్లించుకుంది! వీడియో వైరల్

‘భారత్ వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచింది కానీ ఒక మ్యాచ్‌లో పేలవంగా ఆడింది. సెమీ ఫైనల్, ఫైనల్ నాకౌట్ మ్యాచ్‌లు కాబట్టి బాగా ఆడాలి. లీగ్‌ దశలో అగ్రస్థానంలో నిలిచామా? లేదా 4వ స్థానంలో నిలిచామా? అనేది ముఖ్యం కాదు. అత్యుత్తమ జట్టు ప్రపంచకప్‌ సాధించిందని అంగీకరించండి. ఫైనల్‌లో భారత్ బాగా ఆడలేదు. మీరు ఈ వాస్తవానికి దూరంగా ఆలోచించకండి’ అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 241 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా మరో 7 ఓవర్లు ఉండగానే ఛేదించింది.