Site icon NTV Telugu

Gautam Gambhir Salary: అయ్యా బాబోయ్.. గౌతమ్ గంభీర్ శాలరీ అన్ని కోట్లా?

Gautam Gambhir Salary

Gautam Gambhir Salary

టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ భారత క్రికెట్‌ జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. జూలై 2024లో భారత మాజీ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. గౌతీ కోచ్‌గా వచ్చాక టీమిండియా అద్భుత విజయాలు అందుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఆసియా కప్‌ 2025ను కైవసం చేసుకుంది. వివాదాస్పద నిర్ణయాలతో తరచుగా వార్తల్లో నిలిచే గంభీర్.. జట్టును మాత్రం అద్భుతంగా నడిపిస్తున్నారు. ఆసియా కప్‌ విజయం నేపథ్యంలో గౌతీ శాలరీపై చర్చలు మొదలయ్యాయి. తమిండియా కోచ్ రోజుకు లేదా నెలకు ఎంత సంపాదిస్తాడని ప్రతి అభిమాని తెలుసుకోవాలనుకుంటున్నాడు.

గౌతమ్ గంభీర్ శాలరీ గురించి ఖచ్చితమైన గణాంకాలు తెలియదు కానీ..గత కోచ్ రాహుల్ ద్రవిడ్ కంటే ఎక్కువగానే తీసుకుంటున్నాడని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. టైమ్స్ నౌ నివేదిక ప్రకారం.. గంభీర్‌కు ఏటా బీసీసీఐ 12-14 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు సమాచారం. అంటే గౌతీ నెలకు సుమారు 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నారు. రోజుకు 3,83,561 రూపాయలు అన్నమాట. అంతర్జాతీయ పర్యటనల సమయంలో గంభీర్‌కు తన జీతంతో పాటు రూ.21,000 రోజువారీ భత్యం కూడా దక్కుతుంది. జట్టుతో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తారు. ప్రధాన కోచ్‌కు అండ్ అన్ని ప్రయోజనాలు పొందుతారు.

గౌతమ్ గంభీర్ తన క్రికెట్ కెరీర్‌లో 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లను ఆడారు. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్, 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను రెండు టైటిళ్లకు (2012, 2014) అందించారు. 2024లో కోల్‌కతా మూడవ టైటిల్‌ను సాధించిన సమయంలో జట్టుకు మార్గదర్శకుడిగా ఉన్నారు. ఇప్పుడు హెడ్ కోచ్. క్రికెట్‌తో పాటు గంభీర్ వ్యాపారాల నుంచి కూడా ఆదాయాన్ని పొందుతున్నారు. అతని నికర ఆస్తుల విలువ సుమారు రూ.265 కోట్లు అని సమాచారం.

Also Read: IND vs AUS: ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు స్టార్ ప్లేయర్ అవుట్.. రోహిత్‌, విరాట్‌..!

గౌతమ్ గంభీర్ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఢిల్లీలోని రాజేంద్ర నగర్‌లో ఆయనకు ఒక విలాసవంతమైన బంగ్లా ఉంది. ఆ బంగ్లా విలువ దాదాపు రూ.20 కోట్లు. నోయిడాలోని జేపీ విష్ టౌన్ సహా పలు టాప్ కాలనీలలో ఆయనకు ప్లాట్లు కూడా ఉన్నాయి. లగ్జరీ కార్స్ అంటే అతడికి ఇష్టం. రూ.7.4 మిలియన్ల విలువైన BMW 530D అతడి వద్ద ఉంది. గౌతీ గ్యారేజీలో ఆడి Q5, SX4, మహీంద్రా బొలెరో స్టింగర్, టయోటా కరోలా వంటి కార్లు కూడా ఉన్నాయి.

Exit mobile version