NTV Telugu Site icon

Team India Coach : ఆ కండీషన్​కు ఓకే చెప్తే టీమిండియా హెడ్​ కోచ్​గా గంభీర్..?

Gautam Gambhir

Gautam Gambhir

Team India Coach : ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ 2024 తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ మారనున్నాడు. ఈ నేపథ్యంలో అనేకమంది పేర్లు వినిపించిన., చివరికి టీమిండియా మాజీ క్రికెటర్, వరల్డ్ కప్ టీమ్ మెంబర్ అయిన గౌతమ్ గంభీర్ (GAUTAM GAMBHIR) పేరు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తోంది. ఇకపోతే ఈయన పేరు దాదాపు అన్ని విషయాలకు సంబంధించి ఖరారు అయినట్లు సమాచారం అందుతుంది. ఈ విషయం సంబంధించి బిసిసిఐ వర్గాలలో కూడా భారత జట్టుకు ప్రధాన కోచ్ ఉండటానికి గౌతమ్ గంభీర్ తో చర్చలు జరిపినట్లు అర్థమవుతోంది. ఆయన టి20 తర్వాత రాహుల్ ద్రావిడ్ స్థానాన్ని భర్తీ చేస్తున్నట్లు సమాచారం.

Pawan Kalyan:19వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్

ఇకపోతే ప్రధాన కోచ్ గా బాధ్యతలు స్వీకరించడానికి గౌతమ్ గం బీసీసీఐ ముందు కొన్ని కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సపోర్టింగ్ స్టాఫ్ ను నియమించే సమయంలో తనకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలంటూ ఆయన అడిగినట్లు సమాచారం. ఈ విషయంపై బిసిసిఐ కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ తరుణంలో ప్రస్తుతం ఉన్న సహాయక సిబ్బంది మొత్తం తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక టీమిండియాకు ప్రస్తుతం ఫీల్డింగ్ కోచ్ గా దిలీప్, బ్యాటింగ్ కోచ్ గా విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ గా పరాస్ మాంబ్రేలు సేవలందిస్తున్నారు.

Kalavedika Ntr Film Awards: కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ పోస్టర్ లాంచ్ చేసిన ఏపీ సీఎం..

ఇక ముందు ముందు టీమిండియా సిబ్బందిలో మాత్రమే కాకుండా జట్టులో కూడా పలు మార్పులు చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ విషయంపై గంభీర్ తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత జట్టుకు కోచ్ గా ఉండాలని నేను అనుకుంటున్నాను. జాతీయ టీంకు కోచింగ్ ఇవ్వడం కంటే మరో గొప్ప గౌరవం ఇంకొకటి ఉండదని నా అభిప్రాయం. 140 మంది కోట్లు భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు లెక్క అని ఆయన వ్యాఖ్యానించారు. ఇకపోతే కొన్ని అందుతున్న సమాచారాల మేరకు గంభీర్ నియామకం ఇప్పటికే పూర్తయిందని., జూన్ చివరిలో ఆయనకు అఫీసియల్ అనౌన్స్మెంట్ చేసి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది.