Gautam Gambhir: “అరే యార్.. మీరు ఎలా మేనేజ్ చేస్తారు?”.. అభిమానులతో గంభీర్ ఫన్నీ చిట్‌చాట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir: నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ vs దక్షిణాఫ్రికా జరగనుంది. ఈ టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్ ఎయిట్‌లో భారత్‌కు తొలి మ్యాచ్ ఇది. అల్రేడీ టీమిండియా అక్కడికి చేరుకుంది. అయితే.. మ్యాచ్‌కు ముందు రోజు భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) అభిమానులతో ముచ్చటించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆటోగ్రాఫ్‌లు, ఫోటోల కోసం అభిమానులు గంభీర్‌ని చుట్టుముట్టగా.. “అరే యార్, మీరు ప్రతి స్టేడియంకీ వస్తుంటారు.. ఇది ఎలా మేనేజ్ చేస్తారు?” అని ప్రశ్నించారు. అయితే.. ఈ అభిమానులు భారత్‌లో ఎక్కడ మ్యాచ్ జరుగుతున్న వస్తుంటారట. అందుకే గంభీర్ వీళ్లకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ మీరు ఎక్కడ ఉంటారు? ఏ హోటల్లో ఉంటారని అడిగారు. ఆ అభిమానులు పలు ప్రశ్నలు అడగటం వీడియోలో కనిపించింది.
READ MORE: PM Modi: కాంగ్రెస్ ఇప్పటికే నగ్నంగా ఉంది, చొక్కాలు విప్పడం దేనికి..
Also Read
- Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
- Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్‌పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఫామ్‌పైనే ఉంది. ప్రస్తుత టోర్నీలో వరుసగా మూడు సార్లు డక్ అవుట్ కావడంతో అతడు పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని ఎదురుచూస్తున్నాడు. అయితే అతని ఫామ్‌పై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) మాత్రం ఏమాత్రం కలత చెందడం లేదు. “అభిషేక్ ఫామ్ గురించి నేను కాదు, అతని ఫామ్ గురించి ఆందోళన పడుతున్న వాళ్ల గురించి నేను ఆలోచిస్తున్నాను. గత సంవత్సరం అతడు మమ్మల్ని కాపాడాడు. ఇప్పుడు అతడిని మేము సపోర్ట్ చేయాల్సిన సమయం. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు రన్స్ చేయలేదు కాబట్టి ప్రత్యర్థి జట్లు జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి అభిషేక్ రన్స్ చేస్తే ఏమవుతుందో మీకే తెలుసు” అని సూర్యకుమార్ అన్నారు. టోర్నీలో ఇప్పటివరకు అభిషేక్ అవుట్ అయిన ప్రతి సారి దూకుడైన షాట్లు ఆడే ప్రయత్నంలోనే ఔటయ్యాడు. అదే ఆటతీరు టోర్నీకి ముందు అతడికి మంచి ఫలితాలు ఇచ్చింది. అందుకే తన సహజమైన స్టైల్‌ను మార్చకూడదని జట్టు కోరుకుంటుందని సూర్యకుమార్ స్పష్టం చేశాడు.
READ MORE: Hardik Pandya: విడాకుల తర్వాత కూడా హార్దిక్ ప్రేమ.. నటాశా, అగస్త్యకు లగ్జరీ డిఫెండర్ గిఫ్ట్
🚨Gautam Gambhir interacting with fans during the practice session while giving an autograph.
While signing, he said,
‘Arey yaar, aap har venue mein pahunch jaate ho, kaise manage karte ho itna sab? Kahaan rehte ho? Yahan par kahaan rehte ho?’Gambhir was seen asking a fan a… pic.twitter.com/ldXpxeekW7
— Sonu (@Cricket_live247) February 21, 2026
తాజావార్తలు
-
Honor Turbo 5G: హానర్ టర్బో 5G విడుదల.. 8,560mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో కొత్త 5G ఫోన్
-
ToxicTheMovie : ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్‌లు కూలి విద్యార్థులకు గాయాలు
-
Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్‌స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
-
Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!