Site icon NTV Telugu

Gautam Gambhir: “అరే యార్.. మీరు ఎలా మేనేజ్ చేస్తారు?”.. అభిమానులతో గంభీర్ ఫన్నీ చిట్‌చాట్ వైరల్

Ganbhir

Ganbhir

Gautam Gambhir: నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ vs దక్షిణాఫ్రికా జరగనుంది. ఈ టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్ ఎయిట్‌లో భారత్‌కు తొలి మ్యాచ్ ఇది. అల్రేడీ టీమిండియా అక్కడికి చేరుకుంది. అయితే.. మ్యాచ్‌కు ముందు రోజు భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) అభిమానులతో ముచ్చటించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆటోగ్రాఫ్‌లు, ఫోటోల కోసం అభిమానులు గంభీర్‌ని చుట్టుముట్టగా.. “అరే యార్, మీరు ప్రతి స్టేడియంకీ వస్తుంటారు.. ఇది ఎలా మేనేజ్ చేస్తారు?” అని ప్రశ్నించారు. అయితే.. ఈ అభిమానులు భారత్‌లో ఎక్కడ మ్యాచ్ జరుగుతున్న వస్తుంటారట. అందుకే గంభీర్ వీళ్లకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ మీరు ఎక్కడ ఉంటారు? ఏ హోటల్‌లో ఉంటారని అడిగారు. ఆ అభిమానులు పలు ప్రశ్నలు అడగటం వీడియోలో కనిపించింది.

READ MORE: PM Modi: కాంగ్రెస్ ఇప్పటికే నగ్నంగా ఉంది, చొక్కాలు విప్పడం దేనికి..

ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఫామ్‌పైనే ఉంది. ప్రస్తుత టోర్నీలో వరుసగా మూడు సార్లు డక్ అవుట్ కావడంతో అతడు పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని ఎదురుచూస్తున్నాడు. అయితే అతని ఫామ్‌పై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) మాత్రం ఏమాత్రం కలత చెందడం లేదు. “అభిషేక్ ఫామ్ గురించి నేను కాదు, అతని ఫామ్ గురించి ఆందోళన పడుతున్న వాళ్ల గురించి నేను ఆలోచిస్తున్నాను. గత సంవత్సరం అతడు మమ్మల్ని కాపాడాడు. ఇప్పుడు అతడిని మేము సపోర్ట్ చేయాల్సిన సమయం. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు రన్స్ చేయలేదు కాబట్టి ప్రత్యర్థి జట్లు జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి అభిషేక్ రన్స్ చేస్తే ఏమవుతుందో మీకే తెలుసు” అని సూర్యకుమార్ అన్నారు. టోర్నీలో ఇప్పటివరకు అభిషేక్ అవుట్ అయిన ప్రతి సారి దూకుడైన షాట్లు ఆడే ప్రయత్నంలోనే ఔటయ్యాడు. అదే ఆటతీరు టోర్నీకి ముందు అతడికి మంచి ఫలితాలు ఇచ్చింది. అందుకే తన సహజమైన స్టైల్‌ను మార్చకూడదని జట్టు కోరుకుంటుందని సూర్యకుమార్ స్పష్టం చేశాడు.

READ MORE: Hardik Pandya: విడాకుల తర్వాత కూడా హార్దిక్ ప్రేమ.. నటాశా, అగస్త్యకు లగ్జరీ డిఫెండర్ గిఫ్ట్

Exit mobile version