మాజీ క్రికెట్ దిగ్గజం, కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా గౌతం గంభీర్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. గంభీర్తో బీసీసీఐ సుధీర్ఘ చర్చలు జరిపినట్లు సమాచారం. గంభీర్తో 4 గంటలపాటు బీసీసీఐ సెక్రటరీ జైషా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గంభీర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాగా.. ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ కి 3 సార్లు టైటిల్ అందించాడు గంభీర్. 2012, 2014లో గంభీర్ కెప్టెన్గా ఉన్నప్పుడు కేకేఆర్ కి టైటిల్ అందించి పెట్టాడు. తాజా సీజన్లో టైటిల్ సాధించిన కేకేఆర్.. ఆ జట్టుకు గంభీర్ మెంటర్గా ఉన్నాడు. 2021, 2022 సీజన్లలో లక్నోకి మెంటర్గా ఉన్న గౌతం గంభీర్.. ఈ రెండు సీజన్లలో లక్నోని గంభీర్ ప్లేఆఫ్స్ కు చేర్చాడు. ఈ క్రమంలో.. టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్ అయితేనే జట్టు మరింత పటిష్టంగా ఉంటుందని పలువురు క్రికెట్ దిగ్గజాలతో పాటు.. ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు.
T20 World Cup 2024 Semifinals: సెమీఫైనల్ చేరుకొనే ఆ 4 టీమ్స్ ఇవే..
వచ్చే నెలతో కోచ్గా ద్రావిడ్ పదవీ కాలం ముగియనుంది. హెడ్ కోచ్గా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ ద్రవిడ్ను కోరినప్పటికీ.. అతను ఆసక్తి లేదని చెప్పాడు. మరోవైపు.. నేషనల్ క్రికెట్ అకాడమీ కోచ్గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ను కూడా బీసీసీఐ అడిగింది. అతను కూడా తనకు ఆసక్తి లేదని చెప్పాడు. ఈ క్రమంలో.. బీసీసీఐ గౌతం గంభీర్ను సంప్రదించారు. హెడ్ కోచ్గా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. హెడ్ కోచ్గా గంభీర్ అధికారిక ప్రకటనే ఆలస్యం అని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. కోచ్ పదవికి సంబంధించి బీసీసీఐ కార్యదర్శి జై షా, గంభీర్‌ల మధ్య డీల్ కుదిరిందని.. ఈ విషయమై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని సదరు ఫ్రాంచైజీ ఓనర్ చెప్పినట్లు సమాచారం.
Drink and drive: రక్తంలో ఆల్కహాల్ శాతం ఎంత ఉంటే కేసు నమోదు అవుతుందో తెలుసా?
కాగా ఐపీఎల్ ఫైనల్ ముగిశాక గంభీర్-జై షా చాలాసేపు బహిరంగంగా మాట్లాడుకోవడం అందరూ చూశారు. టీమిండియా హెడ్ కోచ్ పదవి పైనే ఈ డిస్కసన్ జరిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా నియమించే విషయమై బీసీసీఐ సమావేశం జరిగినట్లు సమాచారం. అయితే, టీమిండియా హెడ్ కోచ్ పదవిని చేపట్టే అంశంపై ఇటు గౌతం గంభీర్ గానీ, అటు బీసీసీఐ గానీ ఇప్పటివరకూ స్పందించలేదు. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ పదవికి పలువురు విదేశీ మాజీ ఆటగాళ్ల పేర్లు సైతం బీసీసీఐ పరిశీలనకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి.