Maha Kumbh Mela 2025: ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani) మహాకుంభ మేళాలో (Maha Kumbh Mela) పుణ్యస్నానం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్బంగా ఆయన ఇస్కాన్ శిబిరానికి చేరుకుని భక్తులకు సేవలందించనున్నారు. అదానీ బంద్వాలో హనుమాన్ (Hanuman) ఆలయాన్ని కూడా దర్శించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం ఇస్కాన్ (ISKCON) సంస్థ భారీ ఏర్పాట్లు చేసింది. గౌతమ్ అదానీ మహాకుంభ మేళ ప్రాంతంలో సేవా కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. అదానీ గ్రూప్ ప్రతిరోజూ లక్ష మందికి ఉచిత మహాప్రసాదాన్ని (free meals) పంపిణీ చేస్తోంది. ఈ భోజనంలో రోటీలు, పప్పు, అన్నం, కూరగాయలు, మిఠాయిలు తదితర భోజనాలను భక్తులకు అందిస్తున్నారు. డిఎస్‌ఎ గ్రౌండ్ సమీపంలో భారీ వంటగదిని ఏర్పాటు చేసి, ప్రతిరోజూ లక్ష మందికి పైగా భోజనం తయారు చేస్తున్నారు. వికలాంగులు, వృద్ధులు, చిన్న పిల్లల కోసం అదానీ గ్రూప్ గోల్ఫ్ కార్ట్స్ ల సౌకర్యాన్ని కల్పించింది. ఈ బ్యాటరీతో నడిచే వాహనాల ద్వారా వారు సులభంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. భక్తుల ప్రయాణం సులభతరం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Also Read: BSNL Recharge: జియో, ఎయిర్‌టెల్‌కు ఇక దబిడి దిబిడే.. రోజుకు రూ.5 ఖర్చుతో బిఎస్ఎన్ఎల్ ఏడాది రీఛార్జ్
అదానీ ఇస్కాన్ క్యాంప్‌లో భండారా ప్రసాద్ లో కొద్దీ సేపు సేవలందించనున్నారు. ఇస్కాన్, గీతా ప్రెస్‌ల సహకారంతో అదానీ గ్రూప్ భక్తుల కోసం వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. దీనిలో భాగంగా కోటి ఆరతులను పంపిణీ చేస్తూ మహాకుంభ స్ఫూర్తిని నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది. గౌతమ్ అదానీ ఇటీవల ఇస్కాన్ గురు ప్రసాద్ స్వామిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “సేవే నిజమైన దేశభక్తి రూపం. సేవే ధ్యానం, సేవే ప్రార్థన, సేవే భగవంతుడు” అంటూ తన భావనను వ్యక్తం చేశారు. ప్రయాగ్‌రాజ్ జంక్షన్ సమీపంలో మహాప్రసాదం అందించడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు సమర్ధవంతమైన సేవలు అందించడానికి 1,800 మంది సిబ్బందిని నియమించారు. భక్తులు సేవలను సులభంగా పొందేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి.