Adani Group : స్టాక్ మార్కెట్ పతనం ప్రారంభమైనప్పుడు ఎంత పెద్ద మిలియనీర్లకైనా వణుకు తెప్పిస్తుంది. బుధవారం కూడా స్టాక్ మార్కెట్లలో ఇదే గందరగోళ వాతావరణం నెలకొంది. బిఎస్‌ఇ సెన్సెక్స్ బుధవారం 1100 పాయింట్లు పతనమైంది. సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి 906 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఒక్క రోజులో స్టాక్ మార్కెట్‌లో జరిగిన కొన్ని భారీ పతనాలలో ఇది ఒకటి. ఈ మార్కెట్ తుఫానులో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి భారీ నష్టం వాటిల్లింది. అదానీ గ్రూప్‌కు చెందిన లిస్టెడ్ కంపెనీల షేర్లు పతనమయ్యాయి.
Read Also:Russia: పుతిన్ సంచలన నిర్ణయం.. ఫిన్లాండ్ సరిహద్దుల్లో రష్యా బలగాల మోహరింపు..
గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్‌లో 10 లిస్టెడ్ కంపెనీలను కలిగి ఉంది. ఈ అన్ని కంపెనీల షేర్లు బుధవారం రెడ్ జోన్‌లో ఉన్నాయి. సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి వాటి మొత్తం మార్కెట్ విలువ రూ. 1.12 లక్షల కోట్లు తగ్గింది. అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్ లిస్టెడ్ కంపెనీలలో అదానీ టోటల్ గ్యాస్ షేర్లలో అత్యధిక క్షీణత కనిపించింది. ఈ కంపెనీ షేరు ధర 9.50 శాతం పడిపోయింది. దీంతో పాటు అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు 9.07 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేరు 8.54 శాతం, ఎన్డీటీవీ షేరు 7.92 శాతం, అదానీ పోర్ట్స్ షేర్ 6.97 శాతం నష్టపోయాయి.
Read Also:HanuMan : హనుమాన్ ఓటీటీ ప్రమోషన్స్ కు సిద్ధం అయిన తేజ సజ్జా..
ఇదే సమయంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 6.91 శాతం పతనం కాగా.. ఏసీసీ షేర్లు 6.87 శాతం, అదానీ పవర్ 4.99 శాతం, అంబుజా సిమెంట్స్ 4.58 శాతం, అదానీ విల్‌మార్ షేర్లు 4.25 శాతం పడిపోయింది. వీటన్నింటి మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంసిఎపి) బుధవారం రూ.1,12,780.96 కోట్లు తగ్గింది. గత ఏడు ట్రేడింగ్ రోజులుగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు ధర పతనం కొనసాగుతోంది. అదానీ పవర్ షేర్లు ఈరోజు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. BSE 30-షేర్ సెన్సెక్స్ 906.07 పాయింట్లు లేదా 1.23 శాతం పడిపోయి 72,761.89 వద్ద ముగిసింది.
