NTV Telugu Site icon

Gauri Satish : షాబాద్‌లో దీక్ష పేరిట రైతులను మోసం చేసింది బీఆర్ఎస్

Congress

Congress

Gauri Satish : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల షాబాద్‌లో దీక్ష పేరిట రైతులను మోసం చేసింది బీఆర్ఎస్ అని ఆరోపించారు తెలంగాణ స్పోక్స్ పర్సన్ గౌరీ సతీష్. పవిత్రమైన చేవెళ్లని బీఆర్ఎస్ నాయకులు అపవిత్రం చేశారని శుద్ధి కార్యక్రమం చేపట్టింది చేవెళ్ల కాంగ్రెస్. ఈ కార్యక్రమంలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామేనా భీమ్ భరత్, తెలంగాణ స్పోక్స్ పర్సన్ గౌరీ సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం పామేన భీమ భరత్, తెలంగాణ స్పోక్స్ పర్సన్ గౌరీ సతీష్, మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రెండు పర్యాయాలు యావత్ తెలంగాణ సమాజాన్ని మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ లక్ష రుణమాఫీల కోసం రెండు పర్యాయాలు దాంతో పాటుగా ఓరి ఏస్తే స్టోరీ అన్నట్టుగా రైతులకు నష్టపరిహారం చేయకుండా ఇక్కడి ప్రజా ధనాన్ని రెండు లక్షల రూపాయలు పంచినటువంటి దుర్బుద్ధి కేసీఆర్ ప్రభుత్వంది అని ఆయన అన్నారు.

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై ఎగిరిన గుర్తు తెలియని డ్రోన్..

ఆరు గ్యారెంటీలు కచ్చితంగా అమలు చేస్తాం ప్రజలకు అండగా ఉంటామని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు ఏమి న్యాయం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అన్ని హామీలు ప్రజలకు అమలు చేయడం జరిగిందన్నారు. మీ అందరికి తెలుసు మహిళలకు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేసేటటువంటి సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తుందన్నారు.

అదేవిధంగా వరంగల్ లో రైతు డిక్లరేషన్లు కాంగ్రెస్ పార్టీ చేసింది తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, జాతీయ నాయకులు ప్రజలకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ చెప్పారన్నారు. చెప్పినట్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రుణమాఫీ చేసిందన్నారు. అంతేకాకుండా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉంచుకొని రూ.12 వేల రైతు భరోసా ఇచ్చేందుకు మంత్రి మండలి నిర్ణయం తీసుకుందన్నారు.

Tollywood : పొంగల్‌కు వచ్చిన ప్రతిసారి హిట్టు కొట్టిన బడా నిర్మాత