NTV Telugu Site icon

Gas leak In Airport: మలేసియా ఎయిర్పోర్టులో గ్యాస్ లీక్.. 39 మంది ప్రయాణికులకు అస్వస్థత..

Airport

Airport

Gas leak In Airport: మలేసియాలోని కౌలాలంపూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో గ్యాస్‌ లీక్‌ కావడంతో సుమారు 39 మంది ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్‌పోర్ట్‌లోని సదరన్ సపోర్ట్ జోన్ సెపాంగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీరింగ్ ఫెసిలిటీ దగ్గర గురువారం ఉదయం 11.23 గంటలకు గ్యాస్ లీక్ అయినట్లు పేర్కొన్నారు. ఇక, సమాచారం అందుకున్న సెలంగోర్ అగ్నిమాపక విభాగం గ్యాస్ లీకేజీని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో దాదాపు 39 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. మరో 14 మందిని చికిత్స కోసం ఎయిర్ డిజాస్టర్ యూనిట్‌కి పంపినట్లు చెప్పారు.. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.

Read Also: ఏంటీ.. బరువు తగ్గే మందులతో కంటిచూపు పోతుందా..?

అయితే, ఇప్పటి వరకు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు పేర్కొన్నారు. ఇక, విడుదలైన గ్యాస్‌ను మిథైల్ మెర్‌కాప్టాన్‌గా ఆగ్నిమాపక సిబ్బంది గుర్తించామన్నారు. విమాన రాకపోకల సమయాల్లో ఎటువంటి మార్పులు ఉండవని అధికారులు వెల్లడించారు. ప్రమాదకర మెటీరియల్స్ బృందంతో పాటు సిబ్బందిని పంపించామని సెలంగోర్ రాష్ట్ర అగ్నిమాపక విభాగం చెప్పుకొచ్చింది. ప్యాసింజర్‌ టెర్మినల్‌కు ఇంజినీరింగ్‌ సౌకర్యం వేరుగా ఉందని తెలిపింది. గ్యాస్‌ లీక్‌ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.