విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన ఉక్కు ఉద్యమం 1000 రోజుకు చేరుకుంది. ఉక్కు ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ దీక్ష శిబిరానికి భారీగా స్టీల్ కార్మిక సంఘాల నేతలు, ఉద్యోగులు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటామని వారు పేర్కొన్నారు. ఇక, కార్మిక సంఘాలకు పలు పార్టీలకు చెందిన నేతలు సంఘీభావం తెలియజేస్తున్నారు.
Read Also: Sreeleela: స్టైలిష్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శ్రీలీల…
ఇక, విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కార్మికా సంఘాల నాయకులను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కలిసి వారికి మద్దుతు ఇచ్చారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. పోరాటాల ద్వారా విశాఖ స్టీల్ ఫ్లాంట్ పరిశ్రమ సాధించుకున్నామని ఆయన పేర్కొన్నారు. దాదాపు 32 మంది ప్రాణత్యాగం చేశారు.. విశాఖ స్టీల్ ఫ్లాంట్ కోసం ఎన్నికలు పక్కన పెట్టి పోరాడాలి.. విశాఖ స్టీల్ ఫ్లాంట్ కోసం నేను రాజీనామా చేశాను అని గంటా తెలిపారు. ఇక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్టీల్ ఫ్లాంట్ విషయంలో విఫలం అయ్యారు అని గంటా శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ ఎంపీలు స్టీల్ ఫ్లాంట్ కోసం ఎందుకు మాట్లాడడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అని ఆరోపించారు. ఈరోజు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సెలవులు ఇచ్చారు అని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.