NTV Telugu Site icon

Yarlagadda Venkata Rao: గన్నవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపుతా..

Yarlagadda Venkata Rao

Yarlagadda Venkata Rao

Yarlagadda Venkata Rao: రాష్ట్రాన్ని వైసీపీ కబంద హస్తాల నుంచి కాపాడాలంటే అది టీడీపీ-జనసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు . విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన పార్టీ కార్యాలయాన్ని గురువారం యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. అనంతరం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని కేక్‌ కట్‌చేసి జన సైనికులకు, మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. రామవరప్పాడు గ్రామం నియోజకవర్గంలోనే పెద్దదని, ఈ గ్రామం నుంచి తనకు అత్యధిక మెజారిటీ ఇవ్వాలని కోరారు. జగన్ పాలనలో వైసీపీ నాయకుల అరాచకాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలి దోచుకోవడం, దాచుకోవటమే వైసీపీ నేతలకు పనిగా మారిందన్నారు. గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఇసుక, మట్టి మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్నారు. ప్రశ్నించే వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతూ వేధిస్తున్నారన్న ఆయన నియోజకవర్గంలో వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తోన్న అధికారులను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఏ అధికారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. తాను ప్రజలకు మంచి చేయటానికే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపిన యార్లగడ్డ.. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే గన్నవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపుతానని హామీ ఇచ్చారు. నియోజకవర్గానికి ఐటీ కంపెనీలు తీసుకొచ్చి యువతకు 50 వేల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కలిసికట్టుగా పని చేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Read Also: Andhra Pradesh: రాష్ట్రంలోని 2 జిల్లాల్లో స్వల్పంగా కంపించిన భూమి

సమావేశం అనంతరం రామవరప్పాడుకు చెందిన వీధి వ్యాపారులకు తన సొంత ఖర్చుతో తోపుడు బండ్లు అందజేశారు. ఈ సందర్భంగా.. రామవరప్పాడు గ్రామానికి చెందిన సుంకర కుటుంబరావు, అల్లాడి రాజేష్, గణేశుల సూరిబాబు, బూరాడ బాలయోగి, పలిశెట్టి రంగా, ఉప్ప రాములు, సుంకర రామకృష్ణ, సుంకర రాంబాబు, పఠాన్ కాలేషా, ఆబోతుల గౌరినాయుడు, బొల్లు రామారావు, లంకలపల్లి కోటేశ్వరరావు, భోగాధి వెంకటేశ్వర రావు, బొల్లు బాలాజీ, కొలసాని శ్రీనివాసరరావు, బొల్లు కనక దుర్గా ప్రసాద్, పోతన నాగేశ్వరరావు, పొన్నాని శ్రీనివాస్, షేక్ వలీ, సాధనాల శ్రీనివాస్, కాట్రగడ్డ విష్ణుమూర్తి, ఆళ్ల దుర్గారావు, వంకరబోయిన వెంకటేశ్వర రావు, గొబ్బె గోపాలకృష్ణ, జుత్తిక రాంబాబు, జుత్తిక స్టాలిన్, జే. కోటయ్య, రెడ్డి అన్నవరం, రెడ్డి రాజు, రెడ్డి సురేష్, జుత్తిక నరసింహమూర్తి, సంసాని నాగరాజు, పితాని కుమార్, పితాని దుర్గారావు వైసీపీ నుంచి టీడీపీలో చేరగా యార్లగడ్డ వెంకట్రావు వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయ్యకర్త చలమలశెట్టి రమేష్, బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జి ఫణి, రాష్ట్ర నాయకుడు దొంతు చిన్న, బోసు బాబు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు దుర్గారావు, గుజ్జర్లపూడి బాబురావు, టీడీపీ గ్రామ అధ్యక్షుడు కొండయ్య, కోనేరు సందీప్, నాని, మేకల స్వాతి, అంగన్వాడీ అధ్యక్షురాలు లలిత, జిల్లా నాయకులు అరుణ, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.