NTV Telugu Site icon

Cannabis Chocolates: రాజేంద్రనగర్ లో భారీగా గంజాయి చాక్లెట్స్.. కేటుగాళ్లు అరెస్ట్..!

Cannabis Chocolates

Cannabis Chocolates

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో భారీగా గంజాయి చాక్లెట్స్ గుట్టు రట్టు అయింది. 4 కేజీల గంజాయి చాక్లెట్స్ ను రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సీజ్ చేశారు. ఇక, కోకాపేట్ రాంకీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ దగ్గర అధికారులు సోదాలు చేశారు. ఓ గదిలో వివిధ బ్రాండ్స్ కు చెందిన గంజాయి చాక్లెట్స్ ఉన్నట్లు గుర్తించారు. ఒడిస్సాకు చెందిన సౌమ్యా రాజన్ అనే వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఒడిస్సా నుంచి గంజాయి చాక్లెట్స్ తెచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు.

Read Also: TS Politics: నేడు ఎమ్మెల్సీలుగా ప్రొ.కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణస్వీకారం..

అయితే, ఇంజనీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో పాటు లేబర్స్ కు ఈ చాక్లెట్స్ విక్రయించినట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వెల్లడించారు. ఒడిస్సాలో తక్కువ ధరకు గంజాయి చాక్లెట్స్ తెచ్చి హైదరాబాద్ లో ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు తెలిపారు. విద్యార్థులకు గంజాయి చాక్లెట్స్ ను కేటుగాళ్లు అలవాటు చేస్తున్నారు. గంజాయి చాక్లెట్స్ సీజ్ చేసి.. నిందితుడిని అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమీషనర్ అదేశాల మేరకు ఈ దాడులు చేశారు. గంజాయి చాక్లెట్స్ దందాను ఎంత కాలం నుంచి కొనసాగిస్తున్నారు? ఎవరెవరికి విక్రయించారు? అనే సమాచారాన్ని అధికారులు కూపీ లాగుతున్నారు.