NTV Telugu Site icon

Ganja Chocolates : ఖమ్మంలో పట్టు బడ్డ గంజాయి చాక్లెట్స్

Ganja Chocolate

Ganja Chocolate

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాపితంగా గంజాయి రవాణా కాకుండా తగిన చర్యలను తీసుకుంటున్నామని ఎక్పైజ్ శాఖ డిప్యూటీ కమీసనర్ జనార్ధన్ రెడ్డి చెబుతున్నారు. గత రాత్రి ఓడిస్సా , ఎపి రాష్ర్టాల మీదుగా గంజాయి చాక్లెట్స్ హైదరాబాద్ కు తరలుతున్న వాటిని ఎక్పైజ్ శాఖ సిబ్బంది పట్టుకున్నారు. ఇలా ఖమ్మంలో గంజా చాక్లెట్స్ పట్టుకోవడం ఇదే ప్రదమం.. హైదరాబాద్ లో చాక్లెట్లను ఒక్క చోట అప్పగించవలసిన ఉన్నదని నిందితులు చెప్పారని అంటున్నారు. దీని మీద ఇంకా లోతుగా విచారణ జరుగుతుందని అంటున్నారు. గత యేడాది మొత్తం గంజాయిని ఉమ్మడి జిల్లా వ్యాపితంగా 3600 కిలోలను పట్టుకున్న ఎక్పైజ్ శాఖ ఈ యేడాది జనవరి నుంచి నెల రోజుల్లోనే ఏడు వందల కిలోల గంజాయిని పట్టుకున్నామని మరింతగా తనిఖీలు ముమ్మరం చేస్తామని అంటున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్పైజ్ శాఖ డిప్యూటీ కమీషనర్ జనార్ధన్ రెడ్డి.

ఇదిలా ఉంటే.. రంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బృందం సోమవారం రాత్రి భారీగా గంజాయి కలిపిన చాక్లెట్లను స్వాధీనం చేసుకుంది. పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు కోకాపేట్‌లోని ఓ ఇంటిపై దాడి చేసి ఓ ముఠా ఒడిశా నుంచి నగరానికి తీసుకొచ్చిన చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఎక్సైజ్‌ అధికారులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారించగా అక్రమ వ్యాపారం గురించి మరింత సమాచారం తెలుసుకున్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. గతేడాది పాఠశాల విద్యార్థులకు చాక్లెట్లు విక్రయిస్తున్న కూలీల ముఠాను కొత్తూరు పోలీసులు అరెస్టు చేశారు.