NTV Telugu Site icon

Gangula Kamalakar : రాహుల్‌ గాంధీ బస్సుయాత్రలో అన్ని అసత్యాలే

Gangula Kamalaker

Gangula Kamalaker

రాహుల్‌ గాంధీ బస్సుయాత్రలో ఆయన అన్ని అసత్యాలే మాట్లాడారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇవాళ మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. ఎవరో స్క్రిప్టు రాసిస్తే చదువుతున్నారే తప్ప.. అందులో ఏది వాస్తం ఏది వాస్తం కాదో గమనించడం లేదన్నారు. కాళేశ్వరం పథకంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని పాత పాటే పాడారు. ప్రాజెక్టు కు 80 వేల కోట్లు ఖర్చు అయితే. లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందో.. రాహుల్‌గాంధీ చెప్పాలన్నారు. రాహుల్ నిన్న, ఈరోజు తిరిగింది అంతా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లొస్తున్న ప్రాంతమే. నిన్న.. మంథని నుంచి.. ప్రాజెక్టు వద్దకు వెళ్లి వస్తే తెలిసేది. ఆ ప్రాజెక్టు ఎంత గొప్పదో అని మంత్రి గంగుల అన్నారు.

అంతేకాకుండా.. ‘ రైతులను అడిగితే తెలిసేది కాళేశ్వరం నీళ్లు వచ్చాయా రాలేదా అని. ఇంత పచ్చి అబద్దాలు చెప్పడం ధర్మామా? కాంగ్రెస్‌ పాలనలో భూములకు సంబంధించిన ఒక్క రికార్డునైనా అధునీకరణ చేసిందా? భారత దేశంలో రెండు సార్లు రుణమాఫి చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవునా కాదా? తెలుసుకోవాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు హామీలు అమలుచేస్తమని హామీ ఇచ్చారు. కాని.. ఐదు నెలల్లోనే అంధకారం నెలకొంది. కర్ణాటకలో రోజుకు వ్యవసాయరంగానికి 7 గంటల కరెంటు ఇస్తామన్నారు. రెండు మూడు గంటలు కూడ ఇవ్వడం లేదు. గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200ల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని ప్రకటించారు. మాకు ఉచితం వద్దు.. కరెంటు బాగా ఇవ్వండి అంటూ ప్రజలు రోడ్డెక్కి ధర్నాలుచేస్తున్నారు. అన్నభాగ్య స్కీం కింద 10 కిలోల బియ్యం ఇస్తామన్నారు. తమ వద్ద స్టాక్‌లేవని చెతులెత్తేసింది. శక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి… డిజిల్‌లేక బస్సులు నిలపివేసి అక్కడ ఆర్టీసీ సంస్థ దివాళా తీసింది. ఇప్పుడు వయసుల వారీగా ఫ్రీ అంటూ కొత్త కోర్రీలు పెడుతోంది.

 

అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటిలో మహిళకు రూ.2వేలువేస్తామని చెప్పి ఇప్పటివరకు హామీని నిలబెట్టుకోలేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్క రంగుమార్చుతున్న కాంగ్రెస్‌ జాతీయ పార్టీకి ఒకే విదానం ఉంటుంది. కానీ.. కాంగ్రెస్‌పార్టీ మాత్రం ఒక్కో రాష్ర్టానికి ఒక్కో రంగు మార్చుతోంది. తెలంగాణలో పింఛన్‌ రూ.4వేలు ఇస్తామని చెపుతున్న కాంగ్రెస్‌.. మిజోరాంలో రూ.2,500లకు పరిమితం చేసింది. తెలంగాణలో వంటగ్యాస్‌ రూ.500లకు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ మిజోరాంలో రూ.750కి ఇస్తామంటోంది. తెలంగాణలో రూ.10 లక్షల వరకు ఆరోగ్యభీమా కల్పిస్తామని చెపుతున్న కాంగ్రెస్‌.. మధ్యప్రదేశ్‌లో రూ.25 లక్షలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2500లు ఇస్తామని చెపుతున్న కాంగ్రెస్‌ మద్యప్రదేశ్‌లో మాత్రం రూ.1500లు ఇస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ ని నమ్మి ఓటు వేస్తే కర్ణాటక మాదిరిగానే మోసం పోతాం. తెలంగాణ బలిదానాలు జరడానికి కాంగ్రెసే కారణం. బీసీ గణన అంటున్నారు. మా బీసీ లకు కులగణన చేపట్టామని మొత్తుకుంటున్నా కాంగ్రెస్, బీజేపీ లు పట్టించుకోలేదు. సంఖ్య బలం ఆధారంగా రాజ్యాధికారం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు… దేశంలో మా వెనుకబడిన శ్రేణులు శాతం చెప్పండి… చట్ట సభలలో మా ప్రాతినిధ్యం పెంచాలని కోరిన పట్టించుకోలేదు… మాకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం…’ అని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.