NTV Telugu Site icon

Gangula Kamalakar : మంత్రి గంగుల కమలాకర్‌కు పితృవియోగం

Gangula

Gangula

తెలంగాణ పౌరసరఫరాలు, బీసీ వెల్ఫేర్ మంత్రి గంగుల కమలాకర్‌ ఇంట విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో కొద్దిసేపటి క్రితం మంత్రి గంగుల కమలాకర్‌ తండ్రి గంగుల మల్లయ్య కన్నుమూశారు. దీంతో గంగుల కమలాకర్‌ ఇంటి విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే.. గంగుల కమలాకర్‌ తండ్రి మృతిపై పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. అయితే.. 2000లో గంగుల కమలాకర్ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 2000 – 2005 మధ్యకాలంలో కరీంనగర్‌ మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా, కరీంనగర్ మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ గా పనిచేశాడు కమలాకర్‌. 2006 – 2007 మధ్యకాలంలో కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ, ఉపాధ్యక్షుడిగా పనిచేసిన గంగుల… 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు.
Also Read : MP Maloth Kavitha : మానవత్వం చాటుకున్న ఎంపీ మాలోత్‌ కవిత

తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీకి రాజీనామా చేసి 2013లో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆతరువాత.. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ కుమార్ పై 24,000వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి 14,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పై గెలుపొందారు. 2019 సెప్టెంబరు 8న ముఖ్యమంత్రి కేసీఆర్ రెండవ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనకు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖలను కేటాయించారు.

Show comments