NTV Telugu Site icon

Gangs of Godavari : మాస్ కా దాస్ విశ్వక్‌ సేన్‌ ‘గ్యాంగ్ అఫ్ గోదావరి’ రిలీజ్ డేట్ కన్ఫామ్..!

Godh

Godh

మస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా నటిస్తున్న చిత్రం గ్యాంగ్ ఆఫ్ గోదావరి. విశ్వక్ సేన్ 11గా వస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా.. డీజే టిల్లు సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహ శెట్టి ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదివరకే విడుదల చేసిన v సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసింది. మూవీ మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్‌ వీడియో పరంగా చూస్తే.. డిసెంబర్ 8న సినిమా విడుదల ప్లాన్ చేసినట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. కాకపోతే., ఆ తర్వాత కూడా సినిమాని డిసెంబర్ 29, 2023 ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించారు. అయిన కానీ అనేక కారణాల వల్ల అది కూడా కుదరలేదు.

Also Read: Chandrababu: జగన్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.. పోలింగే మిగిలింది.. చంద్రబాబు ట్వీట్

పొలిటికల్ ఎలిమెంట్స్ తోసాగే ఈ యాక్షన్ సినిమా రిలీజ్ డేట్ లపై మూవీ మేకర్స్ తాజాగా సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా మే 17న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ కాబోతున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ తెలియజేసింది.ఇదివరకే రిలీజైన ‘ సుట్టంలా సూసి పోకలా ‘ లిరికల్ వీడియో సాంగ్.. సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో భాగంగా సితార సంస్థ బ్యానర్‌ తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌ పై తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్ అంజలి కూడా ఓ కీలక రోల్‌ లో నటిస్తోంది. చూడాలి మరి ఇన్నిసార్లు సినిమా రిలీజ్ డేట్స్ ను మార్చిన మూవీ మేకర్స్ ఇప్పుడు ప్రకటించిన డేట్ కైనా రిలీజ్ చేస్తారో లేదో. దీనికి కారణం లేకపోలేదు.

Also Read: HanuMan : మరి కొద్దిగంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న హనుమాన్ హిందీ వెర్షన్..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

సితార మూవీ మేకర్స్ ఇప్పుడు ప్రకటించిన డేట్ మే 17. మరి ఈ సమయానికి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ఉండడమే. చుడాలిమరి ‘గ్యాంగ్ అఫ్ గోదావరి’ మూవీ మేకర్స్ ఏంచేస్తారో.