Site icon NTV Telugu

IT Gang: గ్యాంగ్‌ మూవీ సీన్ రిపీట్.. ఐటీ అధికారులమంటూ..

Theft

Theft

IT Gang: గుంటూరులో గ్యాంగ్‌ మూవీ సీన్‌ రిపీట్‌ అయింది. ఆ చిత్రంలో లాగే ఐటీ అధికారులమంటూ ఓ మహిళను బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బును ఎత్తుకెళ్లారు దుండగులు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరులోని ప్రగతినగర్‌లో ఐటీ గ్యాంగ్ దోపిడీ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఐటీ అధికారులం అని చెప్పి మారుమూల ప్రాంతంలో ఓ మహిళ ఇంట్లో 50 లక్షలు నగదు, 50 సవర్ల బంగారం దోచుకెళ్లారు. ఇంట్లో ఉన్న మహిళకు గన్ చూపించి బెదిరించారు. ఈ నేపథ్యంలో భయంతో ఆ మహిళ వారికి నగదుతో పాటు నగలు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల హార్డ్ డిస్క్‌ను కూడా దుండగులు తీసుకుపోయారు.

Read Also: Medico Preethi Health Bulletin: డాక్టర్ ప్రీతి పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల..

గుంటూరులోని కొందరు వ్యక్తులకు కళ్యాణి అనే మహిళా బినామీగా ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మారుమూల ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇంట్లో డబ్బులు, నగలు ఎందుకు ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఇంట్లో డబ్బు ఉందని తెలిసిన వారే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు క్లూస్ టీమ్‌తో పాటు మరో మూడు బృందాలు రంగంలోకి దిగాయి. ఈ డబ్బు ఎవరిదనే కోణంలో కూడా విచారణ చేపట్టినట్లు వివరించారు.

Exit mobile version