Ganesh Laddu: విజయవాడ గ్రామీణం నున్న పంచాయతీ పరిధిలోని పవర్ గ్రిడ్ సెంటర్ శ్రీ సాయి బాలాజీ ఎన్ క్లీవ్ అపార్ట్‌మెంట్‌లో నెలకొల్పిన వినాయక విగ్రహం విపోధా ఫిస్పైర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్లు సింగం రెడ్డి ప్రదీప్ రెడ్డి, నక్కా రామ్, బాలాజీ వేడుకల చివరి రోజును నిర్వహించి స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని రూ 26 లక్షలకు సొంతం చేసుకున్నారు. విజయవాడ రూరల్‌లో నెలకొల్పిన వినాయక మండపంలో ఈ లడ్డూ వేలం పాట పెద్ద మొత్తంలో కొనసాగి హైలైట్‌గా నిలిచింది.
Read Also: Kalinga Movie: కళింగ సినిమాపై రిజల్ట్‌పై చిత్రబృందం స్పందన ఇదే..
శ్రీ సాయి బాలాజీ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో వినాయక చవితి నిర్వహణ కమిటీ సభ్యులు బ్రహ్మం, రాజేష్, ప్రదీప్‌లకు లడ్డూ వేలం పాడిన మొత్తాన్ని అందజేశారు. లడ్డు వేలం విజేతను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా లడ్డు భారీ మొత్తంలో పాడుకున్న విజేత సింగం రెడ్డి ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో అపార్ట్‌మెంట్ అభివృద్ధి కార్యక్రమాలకు, వచ్చే ఏడాది అపార్ట్‌మెంట్‌లో వినాయక చవితి వేడుకలు మరింత వైభోవోపేతంగా నిర్వహించుకోవాలనే సదుద్దేశంతోనే రూ.26 లక్షల పెద్ద మొత్తానికి వినాయక లడ్డూ పాట పాడామని పేర్కొన్నారు.. ఈ ఏడాదికి మించి వచ్చే ఏడాది తమ అపార్ట్మెంట్లో వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.