NTV Telugu Site icon

Ganesh Chaturthi 2024: టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో వినాయకుడు.. పక్కనే రోహిత్ శర్మ! వీడియో వైరల్

Ganesh Rhhit

Ganesh Rhhit

Ganpati Bappa holding T20 World Cup 2024 Trophy: దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు అట్టహాసంగా మొదలయ్యాయి. శనివారం (సెప్టెంబర్ 7) వినాయక చవితి నేపథ్యంలో భక్తులు భారీగా విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు తమకు నచ్చిన గణపతిని మండపానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఓ గణపతి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇందుకు కారణం గణేశుడి చేతిలో టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ ఉండడమే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Neeraj Chopra: డైమండ్‌ లీగ్‌ ఫైనల్‌కు నీరజ్‌ అర్హత.. పాకిస్తాన్ స్టార్ అర్షద్‌కు షాక్!

వినాయక చవితి సందర్భంగా కొందరు క్రికెట్ ఫాన్స్ అందరికంటే భిన్నంగా తమ వినాయకుడు ఉండాలనుకున్నారు. వినూత్నంగా ఉండేందుకు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి గణేశుడు టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీని పట్టుకున్నట్లు డిజైన్ చేశారు. అంతేకాదు వినాయకుడిని తీసుకెళ్లే వాహనాన్ని టీమిండియా ఆటగాళ్ల పోస్టర్‌లతో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఛాంపియన్స్ 2024 అని పెద్ద ఫ్లెక్సీ పెట్టారు. రోడ్డుపై ఈ వాహనం వెళుతుండగా.. అందరూ ఆసక్తిగా తిలకించారు. ఇది ముంబైలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోకి లైకుల వర్షం కురుస్తోంది. ఇటీవల రోహిత్ సారథ్యంలోని భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన విషయం తెలిసిందే.

Show comments