Gandikota Murder Case: ఇంటర్ చదువుతున్న మైనర్ బాలిక హత్య గండికోట రహస్యంగా మారింది. అభం శుభం తెలియని ఆ మైనర్ బాలిక ప్రేమించడమే ఆమె చేసిన నేరం ? అయితే మైనర్ బాలికను అతి క్రూరంగా దారుణంగా హింసించి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది ? కుటుంబ సభ్యులా? లేక ప్రియుడా ? వీరెవరు కాకుండా మూడో వ్యక్తుల ప్రమేయం ఉందా ? ఇంతకీ మైనర్ బాలిక హత్య మిస్టరీ వెనుక ఉన్న నిజాలు ఏంటి ? మైనర్ బాలికపై రెఫ్ అటెంప్ట్ జరిగిందా..? అదేమీ లేదంటున్నారు పోలీసులు.. మరి ఆ బాలికను ఎందుకు అంత తీవ్రంగా హింసించి అతి దారుణంగా హత్య చేశారు ? నిర్మానుష్య ప్రదేశంలో నిర్జీవంగా పడి ఉన్న మైనర్ బాలిక మృతదేహాన్ని మొదట కనుగొన్నది ఎవరు? సాయంత్రం దాకా పోలీసులకు కుటుంబ సభ్యులు ఎందుకు ఫిర్యాదు చేయలేదు ? ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో ఇలా ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలు.. పోస్టుమార్టం నివేదికలో పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు వెలుగు చూసాయి.. మైనర్ బాలిక పొట్ట భాగంలో పదేపదే బలమైన గుద్దులు గుద్దడంతో ఆమె లివర్ చితికిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు.. అంతేకాకుండా పేగులు సైతం పగిలిపోయాయి. దీంతో ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి ఆమె పొట్టలో దాదాపు ఒక్క లీటర్ మేర రక్తం పేరుకుపోయింది.. ఆ బాలిక లివర్ 8 ఇంచులు మేరా డామేజ్ అయింది.. అంటే ఎంత బలంగా కొట్టారో ఇట్టే అర్థమవుతుంది.
Read Also: SBI Insurance Policy: ఎస్బీఐ పాలసీ.. రోజుకు రూ. 6 పొదుపు చేస్తే చాలు.. రూ. 40 లక్షలు మీవే!
మైనర్ బాలికను ఆమె ప్రియుడు లోకేష్ గత ఈ నెల 14వ తేదీ ఉదయం 8:40 నిమిషాలకు గండికోటకు తీసుకెళ్లాడు.. తరువాత ఓ ప్రైవేట్ లాడ్జిలో గదిని అద్దెకి తీసుకుని రెండు గంటలు గడిపారు.. బాలిక కోసం వెతుకుతున్న ఆమె కుటుంబ సభ్యులు లోకేష్ పై అనుమానంతో ఆయన కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశారు. మైనర్ బాలిక బంధువులు గండికోటకు వస్తున్నారు మిమ్మల్ని చంపేస్తారు అక్కడి నుండి వెళ్లిపోండి అని లోకేష్ బంధువులు వారిని హెచ్చరించారట.. దీంతో లోకేష్ మైనర్ బాలికను గండికోట ముఖ ద్వారం వద్ద వదిలి వేను వెంటనే పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఆ తరువాత మైనర్ బాలిక గండికోటలోని మాధవరాయ స్వామి గుడి వద్ద ఉదయం 11:30 గంటలకు టూరిస్టులకు కనిపించింది. ఆ తరువాత రంగనాయక స్వామి గుడిలోకి వెళుతున్న దృశ్యాలు చిక్కాయి. 11:45 నిమిషాలకు ఆమె సోదరుడు సురేంద్ర బాలికను వెతకడానికి గండికోటకు చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు 25 నిమిషాల తర్వాత సురేంద్ర అక్కడి నుండి తిరిగి వెళ్లిపోయినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ 25 నిమిషాలు ఏమి జరిగింది అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.. మైనర్ బాలిక ఉదయం 11:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడిస్తున్నాయి.
Read Also: Piaggio Electric Auto: పియాజియో నుంచి కొత్త ఎలక్ట్రిక్ ఆటోలు విడుదల.. సింగిల్ ఛార్జ్ తో 236KM రేంజ్
గండికోట లోని రంగనాయక స్వామి గుడి ఎంట్రన్స్ లో బాలిక తీసుకువెళ్లిన భోజనం క్యారియర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరికొంత దూరం వెళ్లిన తర్వాత ఆ బాలిక చున్నీ గుర్తింపు, మరి కొంత దూరం వెళ్లి చూడగా బాలిక స్కూల్ బ్యాగ్ పడి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు.. అంటే భోజనం చేయడానికి కూర్చున్న బాలికను ఎవరో వెంబడించారు. అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతున్న బాలికను చున్నీ పట్టి లాగడంతో అది జారిపోయి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తరువాత దుండగులకు చిక్కిన మైనర్ బాలికను దారుణంగా కొట్టి పంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆమె ప్రియుడు లోకేష్ గండికోట నుండి ఉదయం 10:44 నిమిషాలకు పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు అయ్యాయి.. అంటే ఈ కేసులో లోకేష్ ప్రమేయం లేదని ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. రెఫ్ అటెంప్ట్ జరిగిందా అనడానికి అన్నవాళ్ళు లభించడం లేదని అంటున్నారు పోలీసులు… మరి మైనర్ బాలికను ఇంత దారుణంగా హత్య చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది ? అంటే అందరి చూపు కుటుంబ సభ్యులు వైపే చూపుతున్నాయి.. బాలికను హత్య చేయడానికి పక్కా స్కెచ్ వేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.. ఎక్కడ ఇటువంటి ఆనవాళ్లు మిగలకుండా బాలికను మట్టు పెట్టారంటే ప్రొఫెషనల్ కిల్లర్స్ లా జాగ్రత్తలు తీసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు..
Read Also: Illegal immigrants: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. భారత్‌పై హక్కుల సంస్థ ఆరోపణలు..
అయితే, ఎటువంటి ఆనవాళ్లు దొరకకపోవడంతో పోలీసులకు మైనర్ బాలిక హత్య కేసు సవాలుగా మారింది… ప్రియుడు కాదు.. కుటుంబ సభ్యులు మాత్రం తాము ఎందుకు తమ బిడ్డను చంపుతాము అంటున్నారట.. మరి ఈ హత్య వెనక ఉన్నది ఎవరు? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. హత్య జరిగి 11 రోజులు అవుతున్న ఇప్పటివరకు ఎటువంటి ఆనవాళ్లు దొరకకపోవడంతో మైనర్ బాలిక హత్య కేసు మిస్టరీగా మిగిలిపోయింది.. సెల్ఫోన్ కాల్స్, సోషల్ మీడియా పై దృష్టి పెట్టి విచారణ చేస్తున్న పోలీసులకు కొన్ని కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం.. సెల్ ఫోన్ డంప్స్ ఆధారంగా ఇప్పటి వరకు దాదాపు 150 మందిని పోలీసులు విచారించారు… కుటుంబ సభ్యుల మధ్య ఓ కొత్త నెంబర్ నుంచి 15 సార్లు ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు… ఏది ఏమైనా మైనర్ బాలిక హత్య కేసు ఓ మిస్టరీలా మిగిలిపోయింది..
