మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం గాండీవధారి అర్జున. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమాలో సాక్షి వైద్య వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది.శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.స్పై యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ విడుదల అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.ఇక ఓటీటీలో ఈ సినిమా ఏ ప్లాట్ ఫామ్‌లో వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా డిజిటల్ పార్ట్నర్ గురించి ఆసక్తికర అప్డేట్ బాగా వైరల్ అవుతుంది.
ఈ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ప్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం.ఈ సినిమా విడుదలకు ముందే ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే థియేటర్లలో విడుదలైన నాలుగు నుంచి ఆరు వారాల తరువాత కానుందని సమాచారం. అంటే ఈ సినిమా అక్టోబర్ మొదటి వారం లేదా రెండో వారంలో ఓటీటీ లోకి రానుంది.ఇదిలా ఉంటే.. కొత్త దర్శకుడు శక్తి ప్రతాస్ సింగ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ట్రూ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.. ఈ చిత్రంలో వరుణ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లోని జెట్ ఫైటర్‌గా కనిపించనున్నాడని సమాచారం.. ఈ సినిమాలో మాజీ ప్రపంచ సుందరి మరియు బాలీవుడ్ భామ అయిన మానుషి చిల్లర్ వరుణ్ తేజ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.రెనైసెన్స్ పిక్చర్స్ మరియు సోని పిక్చర్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 8న గ్రాండ్ గా విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.