NTV Telugu Site icon

Paris Olympics 2024: ప్రీ-క్వార్టర్స్‌లోకి భజన్ కౌర్.. క్వార్టర్-ఫైనల్‌కు సాత్విక్-చిరాగ్

Olampics

Olampics

పారిస్ ఒలింపిక్స్లో ఈరోజు (మంగళవారం) భారత్ను మరో పతకం వరించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో మను, సరబ్‌జోత్‌లు కాంస్య పతకాన్ని గెలిచి.. భారత్‌కు రెండో పతకాన్ని అందించారు. అంతకుముందు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను బాకర్ కాంస్యం సాధించిన సంగతి తెలిసిందే.. మహిళల వ్యక్తిగత ఆర్చరీ రౌండ్ ఆఫ్ 16 ప్రీక్వార్టర్స్‌కు చేరుకుంది. భజన్ కౌర్ 7-3తో ఇండోనేషియాకు చెందిన సైఫాను ఓడించింది. తొలి రౌండ్ లో 1-3తో పతనమైన తర్వాత గొప్ప పునరాగమనం చేసింది. దీంతో భజన్ ప్రీ క్వార్టర్స్‌కు చేరుకుంది.

Read Also: IND vs SL T20: ఆదిలోనే వరుస వికెట్లను కోల్పోయిన భారత్..

మరోవైపు.. పురుషుల డబుల్స్ పోటీలో సాత్విక్-చిరాగ్ క్వార్టర్-ఫైనల్‌కు చేరుకున్నారు. చివరి గ్రూప్ స్టేజ్ గేమ్‌లో సాత్విక్-చిరాగ్ విజయం సాధించారు. వారి గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలవడం ద్వారా ఇద్దరూ డబుల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నారు. లా చాపెల్లె ఎరీనా కోర్ట్ 3లో ఇండోనేషియాకు చెందిన ముహమ్మద్ రియాన్ అర్డియాంటో-ఫజర్ అల్ఫియాన్‌లపై దూకుడు ప్రదర్శించి క్వార్టర్ ఫైనల్స్ కు చేరారు.

Read Also: Wayanad landslides: వయనాడ్ విలయంపై శాస్త్రవేత్తల అనుమానాలివే..!

పారిస్‌ ఒలింపిక్స్ 2024లో పూల్‌ బీలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడానికి పురుషుల హాకీ జట్టు ఐర్లాండ్‌పై భారత్ 2-0 తేడాతో సునాయాసంగా విజయం సాధించింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్‌లను ఒకసారి పెనాల్టీ స్ట్రోక్ నుంచి తర్వాత పెనాల్టీ కార్నర్ నుంచి సాధించాడు. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటడంతో ఆస్ట్రేలియా, బెల్జియంలను వెనక్కి నెట్టి పూల్-బిలో భారత్ అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. భారత్‌ తన తర్వాతి మ్యాచ్‌ను ఆగస్టు 1న బెల్జియంతో ఆడనుంది. ఇది భారత్‌కు కీలక మ్యాచ్‌గా మారనుంది.