NTV Telugu Site icon

Game Changer Event : వేదిక పై బాబాయ్, అబ్బాయ్.. పవన్ స్పీచ్ పైనే అందరి కళ్లు

New Project (43)

New Project (43)

Game Changer Event : బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ రామ్ చరణ్ మధ్య బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఈ ఇద్దరు ఎన్నో వేదికలు పంచుకున్నారు. చరణ్‌ కెరీర్ స్టార్టింగ్‌లో ఇద్దరు కలిసి పలు ఇంటర్వ్వూలు కూడా ఇచ్చారు. ఆ సందర్భంగా ఇద్దరి మధ్య జరిగిన ఎన్నో సరదా సన్నివేశాలను అభిమానులతో పంచుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరి క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ గ్లోబల్ స్టార్ అవగా.. గత ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Read Also:Explosion At Factory In Tamil Nadu: తమిళనాడులో బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి!

ఇలాంటి సమయంలో.. అబ్బాయ్ కోసం బాబాయ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్‌గా వస్తున్నారు. దీంతో.. ఇప్పుడు అందరి దృష్టి ఈ ఈవెంట్ పైనే ఉంది. జస్ట్.. ఈ ఇద్దరు కలిసి అలా చేయి ఊపితే చాలు, రెండు తెలుగు రాష్ట్రాలు షేక్ అవనున్నాయి. ఇక టీవిల్లో ఈ ఇద్దరిని చూస్తేనే ఫ్యాన్స్ తట్టుకోలేరు.. అలాంటిది పత్యక్షంగా ఈవెంట్‌లో ఉండే అభిమానుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పైగా లక్ష మంది మెగాభిమానులు రాజమండ్రి గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు రాబోతున్నట్టుగా అంచనాలున్నాయి. అలాంటిది.. పవన్, చరణ్ స్పీచ్‌కు అక్కడి వాతావరణం ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు.

Read Also:Game Changer Event : సర్వం సిద్ధం.. ఆరోజు వేరు, ఈరోజు వేరు.. రీసౌండ్ రావాల్సిందే!

ఖచ్చితంగా.. ఈ ఇద్దరి స్పీచ్‌కు ఫ్యాన్స్ ఊగిపోవడం గ్యారెంటీ. ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ వస్తున్న ఫస్ట్ సినిమా ఈవెంట్ కావడంతో.. పవన్ స్పీచ్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోను ఉంది. అబ్బాయ్ గురించి పవన్ చెప్పే మాటలు వినాలని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అలాగే.. బాబాయ్ గురించి చరణ్ ఈసారి ఏం మాట్లాడుతాడా.. అని ఎదురు చూస్తున్నారు. మొత్తంగా.. ఈరోజు సాయంత్రం జరగనున్న గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ మెగా ఫ్యాన్స్‌కు చాలా స్పెషల్‌గా నిలవనుందనే చెప్పాలి.

Show comments