Game Changer Event : వేదిక పై బాబాయ్, అబ్బాయ్.. పవన్ స్పీచ్ పైనే అందరి కళ్లు
- భారీ బందో బస్త్ నడుమ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
- చీఫ్ గెస్టుగా హాజరు కానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
- బాబాయ్ అబ్బాయ్ కు చూసేందుకు తరలి వస్తున్న ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Game Changer Event : బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ రామ్ చరణ్ మధ్య బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఈ ఇద్దరు ఎన్నో వేదికలు పంచుకున్నారు. చరణ్ కెరీర్ స్టార్టింగ్‌లో ఇద్దరు కలిసి పలు ఇంటర్వ్వూలు కూడా ఇచ్చారు. ఆ సందర్భంగా ఇద్దరి మధ్య జరిగిన ఎన్నో సరదా సన్నివేశాలను అభిమానులతో పంచుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరి క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ గ్లోబల్ స్టార్ అవగా.. గత ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Read Also:Explosion At Factory In Tamil Nadu: తమిళనాడులో బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి!
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
ఇలాంటి సమయంలో.. అబ్బాయ్ కోసం బాబాయ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్‌గా వస్తున్నారు. దీంతో.. ఇప్పుడు అందరి దృష్టి ఈ ఈవెంట్ పైనే ఉంది. జస్ట్.. ఈ ఇద్దరు కలిసి అలా చేయి ఊపితే చాలు, రెండు తెలుగు రాష్ట్రాలు షేక్ అవనున్నాయి. ఇక టీవిల్లో ఈ ఇద్దరిని చూస్తేనే ఫ్యాన్స్ తట్టుకోలేరు.. అలాంటిది పత్యక్షంగా ఈవెంట్లో ఉండే అభిమానుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పైగా లక్ష మంది మెగాభిమానులు రాజమండ్రి గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు రాబోతున్నట్టుగా అంచనాలున్నాయి. అలాంటిది.. పవన్, చరణ్ స్పీచ్‌కు అక్కడి వాతావరణం ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు.
Read Also:Game Changer Event : సర్వం సిద్ధం.. ఆరోజు వేరు, ఈరోజు వేరు.. రీసౌండ్ రావాల్సిందే!
ఖచ్చితంగా.. ఈ ఇద్దరి స్పీచ్‌కు ఫ్యాన్స్ ఊగిపోవడం గ్యారెంటీ. ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ వస్తున్న ఫస్ట్ సినిమా ఈవెంట్ కావడంతో.. పవన్ స్పీచ్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోను ఉంది. అబ్బాయ్ గురించి పవన్ చెప్పే మాటలు వినాలని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అలాగే.. బాబాయ్ గురించి చరణ్ ఈసారి ఏం మాట్లాడుతాడా.. అని ఎదురు చూస్తున్నారు. మొత్తంగా.. ఈరోజు సాయంత్రం జరగనున్న గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగా ఫ్యాన్స్‌కు చాలా స్పెషల్‌గా నిలవనుందనే చెప్పాలి.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!