NTV Telugu Site icon

Ram Charan: గేమ్ చేంజర్ మరో సీన్ లీక్.. సినిమా హైలెట్ సీన్ ఇదే..

Game Changer

Game Changer

గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి లీకుల బెడద మాత్రం తప్పట్లేదు. గతంలో ఏకంగా సినిమాలో సాంగ్‌యే లీకైపోయిన సంగతి తెలిసిందే.. ఈ లీక్ పై నిర్మాత పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.. మొన్న రామ్ చరణ్ లుక్ లీక్ అవ్వగా.. తాజాగా ఓ సీన్ వీడియో లీక్ అయ్యింది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. రామ్ చరణ్,శ్రీకాంత్‌ను ఆప్యాయంగా హగ్ చేసుకొని ఆయన చేతిని పైకెత్తి జనాలకి అభివాదం చేస్తున్నట్లుగా ఈ సన్నివేశం ఉంది.. ఆ సీన్ వీడియో ప్రస్తుతం లీక్ అయ్యినట్లు తెలుస్తుంది.. శ్రీకాంత్ ను సపోర్ట్ చేస్తూ, అతన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నట్లు కనిపిస్తుంది.. ఈ సిన్ సినిమాకు హైలెట్ అవ్వనుందని గతంలో మేకర్స్ ఓ సందర్బంలో చెప్పారు.. ఆ సీన్ ఇప్పుడు లీక్ అవ్వడం పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు..

సినిమా నుంచి ఇలా సీన్లకి సీన్లే లీకైపోతే ఎలా.. దీనిపై యాక్షన్ తీసుకోవాల్సిందే అంటూ కోరుతున్నారు. మరి నిర్మాత దిల్ రాజు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే విడుదలయ్యే వరకు ఆగాల్సిందే..