NTV Telugu Site icon

Kaleshwaram Commission : గజ్వేల్ ENC హరిరామ్‌పై ప్రశ్నల వర్షం కురిపించిన కాళేశ్వరం కమిషన్ చీఫ్

Kaleshwaram Kamission

Kaleshwaram Kamission

గజ్వేల్ ENC హరిరామ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్. కమిషన్ చీఫ్ 90కి పైగా ప్రశ్నలను అడిగారు. అయితే.. పలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ENC హరిరామ్ దాటవేసినట్లు తెలుస్తోంది. రేపు మరోసారి కమిషన్ ముందు ENC హరిరామ్ హాజరుకానున్నారు. ఇవ్వాళ సమాధానం చెప్పని ప్రశ్నలకు రేపు డాక్యుమెంట్స్ సమర్పిస్తామని హరిరామ్ చెప్పారు. అయితే.. ఇప్పటి వరకు కార్పొరేషన్ ద్వారా బ్యాంక్ లకు 29వేల 737 కోట్లు రీ పేమెంట్ చేసినట్లు హరి రామ్ కమిషన్‌కు తెలిపారు. బ్యాంక్ల నుంచి తీసుకున్న డబ్బులో 64వేల కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిగాయని హరి రామ్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్రెయిన్ చైల్డ్ ఎవరని హరిరామ్‌ను కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ అడిగారు.

UP: యూపీలో ఘోరం.. క్షుద్ర పూజలకు విద్యార్థిని బలి ఇచ్చిన యాజమాన్యం

అంతేకాకుండా.. కమిషన్ అడిగే ప్రశ్నలకు పలు సార్లు మాజీ IAS జోషి, మాజీ ENC మురళీధర్ పేరును హరిరామ్ ప్రస్తావించినట్లు సమాచారం. కాళేశ్వరం కార్పొరేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ విషయాల పై హరిరామ్‌ను ఆరా తీసినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ ఫైనాన్స్యల్ స్టేట్మెంట్ ప్రభుత్వానికి ఇచ్చాం.. అది అసెంబ్లీలో పెట్టారా లేదా అనేది తెలీదని హరి రామ్ వివరించాగా.. మేడిగడ్డ బ్లాక్ 7 డామేజ్ కి ఎవరు బాధ్యులు అని హరిరామ్ ను కమిషన్ ప్రశ్నించింది. గేట్స్ ఆపరేట్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడమే ప్రధాన కారణం అని కమిషన్‌కు హరిరామ్ తెలిపారు. 2017 నాటి హైపవర్ కమిటీ మినిట్స్ ను కాళేశ్వరం సీఈ ఫాలో కాలేదు అని కమిషన్ కు హరిరామ్ చెప్పారు.

Minister Ramanaidu: సాగు నీటి సంఘాల ఎన్నికలకు సిద్ధం.. విడుదలైన జీవో..