అఖండ గోదావరి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అభివృధి చేస్తాం అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. రాజమండ్రిలో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకోవడం ఆనందదాయకమన్నారు. 2035 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 లక్షల మంది పర్యాటకులు వచ్చేలా చేస్తామన్నారు. రాజమండ్రిని వారసత్వ సాంస్కృతిక రాజధానిగా గుర్తింపుకు చర్యలు తీసుకుంటాం అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈరోజు ఉదయం రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్రలు శంకుస్థాపన చేశారు.
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన అనంతరం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడారు. ‘అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం ఆనందదాయకం. ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అభివృధి చేస్తాం. 2035 నాటికి ఏపీలో 30 లక్షల మంది పర్యాటకులు వచ్చేలా చేస్తాం. 450 కోట్లతో ఇక్కడ పర్యాటక అభివృధి జరుగుతుంది. రాజమండ్రిని వారసత్వ సాంస్కృతిక రాజధానిగా గుర్తింపుకు చర్యలు తీసుకుంటాం. భారత దేశం మొత్తం 20 మిలియన్ల పర్యాటక రగం ఆకట్టుకునే విధంగా అభివృధి చేస్తాం. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలో పర్యటక అభివృద్ధి వేగవంతమైంది. ప్రపంచంలో పర్యటకుల శాతం వేగంగా పెరిగింది మన భారత్‌లోనే. టూరిజం అభివృద్ధికి ఏపీలో అనుకూల పరిస్థితులు ఉన్నాయి’ అని కేంద్ర మంత్రి చెప్పారు.
Also Read: Priests Dance: పూజారుల మందు పార్టీ.. అశ్లీల నృత్యాలతో రచ్చరచ్చ! వీడియోలు వైరల్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ… ‘డబల్ ఇంజిన్ సర్కార్ కావాలని ప్రజలు కోరుకున్నారు. వికసిత భారత్‌లో ఆంధ్రప్రదేశ్ ఒక భాగం. అమరావతి, పోలవరం ఇలా అన్నింటికీ కేంద్రం సహకారం అందిస్తోంది. హేవలాక్ బ్రిడ్జిని కేంద్ర సహకారంతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. రివర్ ఫ్రంట్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తాం. తూర్పుగోదావరి జిల్లాను హేరిటేజ్ జిల్లాగా తీర్చిదిద్దుతా. ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించా’ అని తెలిపారు.
