Gadwal Murder: పెద్ద ప్లానింగే.. సర్వేయర్ హత్య విషయంలో బయటపడుతున్న సంచలన విషయాలు..!
- సర్వేయర్ హత్య విషయంలో బయటపడుతున్న సంచలన విషయాలు.
- భార్యకు పిల్లలు పుట్టకపోవడంతో ఐశ్వర్యను పెళ్లి చేసుకొవాలని ప్లాన్.
- ఐశ్వర్యను పెళ్లి చేసుకొని,
- ముందుగా లడఖ్ వెళ్లి అక్కడినుండి విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలని..
- రూ.20 లక్షలు లోన్ తీసుకొని అందులో రూ.2 లక్షలు తేజేశ్వర్ ను హత్య చేసిన గ్యాంగుకు సుఫారి.
- ఇటీవల ఇంట్లో ఐశ్వర్య అన్న నవీన్ జారిపడి మరణం.
- ఆ మృతిపైన కూడా అనుమానాలు
- పోలీసుల విచారణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gadwal Murder: తెలంగాణాలో సంచలనం సృష్టించిన గద్వాల జిల్లా సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త మలుపులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు సంబంధించిన ప్రధాన నిందితుడుగా బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుగా పోలీసులు గుర్తించారు. ఈ మర్డర్ కేసు సంబంధించి పోలీసుల విచారణనలో తిరుమలరావు తేజేశ్వర్ హత్య తర్వాత తన భార్యను కూడా హత్య చేయాలనే పథకం వేసినట్టు తెలిసింది.
Read Also:Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ ఎదుట విచారణకు హాజరుకానున్న కామారెడ్డి నేతలు..!
Also Read
ఇకపోతే గత కొంతకాలంగా తిరుమలరావు, ఐశ్వర్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తుండగా.. తిరుమలరావుకు పెళ్లై 8 ఏళ్లవుతున్న సంతానం లేకపోవడంతో, ఐశ్వర్యతో పిల్లలు కనాలని అనుకున్నాడు. దీనితో జీవితంలో అడ్డుగా ఉన్న తన భార్యతో పాటు, సర్వేయర్ తేజేశ్వర్ ను కూడా అడ్డు తొలగించాలనుకున్నాడు. ఈ కారణంగానే తేజేశ్వర్ ను హత్య చేయడానికి సుపారీ గ్యాంగ్ ను నియమించినట్టు సమాచారం. అలాగే తిరుమలరావు భార్యను చంపి ప్రియురాలితో విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకున్నాడు.
Read Also:Raw Garlic : ఈ సమస్యలతో బాధపడేవారు.. ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే డాక్టర్‌తో పని లేదు !
తన భార్యకు పిల్లలు పుట్టకపోవడంతో ఐశ్వర్యను పెళ్లి చేసుకొని, ముందుగా లడఖ్ వెళ్లి అక్కడినుండి విదేశాలకు వెళ్లి సెటిల్ అవుదామని.. అందుకోసం విమాన టిక్కెట్లు కూడా సిద్ధం చేసుకున్నాడు తిరుమలరావు. ఇలా తనపని కావడానికి అడ్డుగా ఉన్న భార్యను చంపేద్దామని నిర్ణయించుకోగా, భర్త కుట్రను ముందే పసిగట్టిన భార్య జాగ్రత్త పడింది. దానితో తేజేశ్వర్ ను చంపుదామని నిర్ణయించుకున్నాడు.
ఈ నేపథ్యంలో బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు రూ.20 లక్షలు లోన్ తీసుకొని అందులో రూ.2 లక్షలు తేజేశ్వర్ ను హత్య చేసిన గ్యాంగుకు ఇచ్చాడని, మిగతా రూ.18 లక్షలు సీజ్ చేశామని పోలీసు అధికారులు తెలిపారు. ఐశ్వర్యకు తిరుమలరావుతో ఉన్న సంబంధం నచ్చక పలుమార్లు తన తల్లి, చెల్లి చెప్పినా వినకపోవడంతో.. అన్న నవీన్ తిట్టేవాడని తెలిపిన స్థానికులు తెలిపారు. అయితే ఇటీవల ఇంట్లో ఐశ్వర్య అన్న నవీన్ జారిపడి మరణించాడని తెలిసింది. అయితే ఇప్పుడు ఆ మృతిపైన కూడా అనుమానాలు ఉన్నాయని, ఆ కోణంలో కూడా విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?