Site icon NTV Telugu

Gadwal MLA Case: నేడు సుప్రీం కోర్టులో గద్వాల్ ఎమ్మెల్యే కేసు

Gadwal Mla Case

Gadwal Mla Case

2018 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని పేర్కొంటూ బీజేపీ నాయకురాలు డీకే అరుణ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తెలిపింది. గద్వాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికైన అభ్యర్థిగా డీకే అరుణను ప్రకటించారు. అలాగే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి రూ. 50 వేలను డీకే అరుణకు ఇవ్వాలని తెలిపింది. అలాగే మూడు లక్షల రూపాయల జరిమాన చెల్లించాలి అని చెప్పింది. అలాగే గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డిపై 6 ఏళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడిగా కోర్టు ప్రకటించింది.

Read Also: NZ World Cup Squad: వెరైటీగా జట్టును ప్రకటించిన న్యూజిలాండ్‌ బోర్డు.. సతీమణులు, పిల్లలతో..!

ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదని హైకోర్టు ప్రకటించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ కేసులో పిటిషనర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గద్వాలలో ఎన్నికల బరిలోకి దిగారు. కానీ, ఆమె బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారంటూ కృష్ణమోహన్‌రెడ్డి ఆరోపించారు. దీంతో నేడు సుప్రీం కోర్టులో గద్వాల్ ఎమ్మెల్యే కేసు విచారణకు రానుంది. గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే అరుణ అంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలన్నారు. హైకోర్టు తీర్పుతో డీకే అరుణను ఎమ్మెల్యేగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

Read Also: Lift Collapse: కుప్పకూలిన లిప్ట్ .. ఏడుగురు కూలీలు మృతి

Exit mobile version