అన్నమయ్య జిల్లాలో రాజకీయం వేడెక్కింది. సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి పై మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి చేసిన వ్యాఖ్యాల పై స్పందించారు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి….డీఎల్ రవీంద్రా రెడ్డి కి పదవీ రాకపోవడంతోనే జగన్ సతీమణి భారతి పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు….దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్న మహోన్నతమైన వ్యక్తురాలు వైఎస్ భారతి…డీఎల్ రవీంద్రా రెడ్డి రాజకీయంగా మాట్లాడొచ్చు.. డీఎల్ కు వ్యక్తిగత విషయాలు అనవసరం…అభివృధ్ధి పైన చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం అన్నారు. మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యల పై వైసిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: RK Roja: పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకుని మాట్లాడుతున్నాడు
వైఎస్ భారతి, విజయమ్మ పై మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలు అర్థ రహితం….సిఎం సతీమణి గా ఎంతో మందికి సేవ చేస్తోంది..పత్రికలు, మీడియా ద్వారా పబ్లిసిటీ కోసం డీ ఎల్ మాట్లాడుతున్నారు..మేం మాట్లాడాలనుకుంటే చాలా చెబుతాం..జగన్ మాకు నేర్పించిన సంస్కారం అడ్డు వస్తోంది అన్నారు శ్రీకాంత్ రెడ్డి. మతిస్థిమితం కోల్పోయి సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు ఇరగం రెడ్డి తిరుపాల్ రెడ్డి…డిఎల్ రవీంద్రారెడ్డికి మంత్రి పదవి రావడానికి కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్న విషయం కూడా మర్చిపోయి డి ఎల్ మాట్లాడుతున్నాడు. డిఎల్ రవీంద్రారెడ్డి సీఎం జగన్ కుటుంబం పై మాట్లాడిన తీరు చూస్తే ఆయనకు మతిస్థిమితం భ్రమించింది. మంత్రి పదవి నుండి రెండు సార్లు బర్తరఫ్ అయిన వ్యక్తి సీఎం జగన్ గురించి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
Read Also: Shakuntalam: మొదటి రోజు అంత తక్కువా… ఇలా అయితే ఒడ్డున పడడం కష్టమే