NTV Telugu Site icon

Bribe: తవ్వే కొద్దీ బయటపడుతున్న గచ్చిబౌలి ఏడీఈ అక్రమాస్తులు..

Ade Sathish

Ade Sathish

లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం అని తెలిసినప్పటికీ లంచావతారులు మారడం లేదు. లంచ రహిత సమాజం కోసం పాటుపడాల్సిన అధికారులు అడ్డదార్లు తొక్కుతున్నారు. ఏసీబీ అధికారులు లంచగొండుల భరతం పడుతున్నప్పటికీ అడ్డుకట్టపడటం లేదు. కాగా.. మరో అవినీతి తిమింగళం బయటపడింది. గచ్చిబౌలి ఏడీఈ అక్రమాస్తులు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి. రూ.100 కోట్లకు పైగా ఆస్తులను ఏడీఈ సతీష్ రెడ్డి కూడబెట్టాడు. కాగా.. నిన్న రూ.50 వేలు లంచం తీసుకుంటూ సతీష్ రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

Read Also: Maha Kumbh: మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం.. మూడోసారి

నిన్నటి నుంచి ఆయన నివాసంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. హైదరాబాద్‌, రంగారెడ్డి, కరీంనగర్‌ జిల్లాల్లో 22 ఎకరాల వ్యవసాయ భూమి, ఓపెన్ ప్లాట్లు, విల్లా, భవనాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ స్థిరాస్తుల మార్కెట్‌ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా.. ఏడీఈ నివాసంలో స్థిరాస్తి పత్రాలు, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం సతీశ్‌రెడ్డిని రిమాండ్‌కు తరలించారు అధికారులు.

Read Also: Cooking Oil Price Hike: సలసలా కాగుతున్న వంట నూనె ధరలు..