4-Day Lockdown: వచ్చే నెలలో ఢిల్లీ వేదికగా జీ-20 సదస్సు జరగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ప్రపంచంలోని ప్రముఖ నాయకులు ఢిల్లీలో సమావేశమవుతారు. ఈ సమయంలో అన్ని ప్రైవేట్ మరియు ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు సెప్టెంబర్ 8 నుండి 10 వరకు మూడు రోజుల పాటు మూసివేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.. న్యూఢిల్లీలోని మార్కెట్లతో సహా బ్యాంకులు మరియు వాణిజ్య సంస్థలు కూడా మూసివేయబడతాయి. జీ20 సదస్సు దృష్ట్యా మూడు రోజుల ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించే ప్రతిపాదనకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆమోదం తెలిపారు. నగరంలోని అన్ని పాఠశాలలు మరియు కళాశాలలతో పాటు ఢిల్లీ ప్రభుత్వం మరియు MCD కార్యాలయాలు మూడు రోజుల పాటు మూసివేయబడతాయి. ఇక, తాజాగా, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఢిల్లీలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలూ మూసివేస్తారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ పేర్కొంది.
Read Also: Mallikarjun Kharge: నరేంద్ర మోడీ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని చంపేస్తోంది..
సెప్టెంబర్ 9, 10 తేదీల్లో శిఖరాగ్ర సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ సభ్యదేశాల రాష్ట్రపతి, ప్రధాని, విదేశాంగ మంత్రి, ఇతర విదేశీ అతిథుల రాక సెప్టెంబర్ 8 నుంచే ఢిల్లీలో ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 8వ తేదీ నుండే సెలవు ప్రకటించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.. మరోవైపు.. దానికి ఒకరోజు ముందు అంటే సెప్టెంబర్ 7న జన్మాష్టమి నాడు సెలవు ఉంటుంది. అంటే సెప్టెంబర్ 7 నుండి 10 వరకు సెలవుదినం ఉంటుంది. దీంతో.. పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది సన్నాహాలు ప్రారంభించారు. ఢిల్లీ సర్కార్ నిర్ణయంతో ఢిల్లీలో నాలుగు రోజుల పాటు సెలవు ఉంటుంది.. ఈ సమయంలో ఏది మూసివేయబడుతుంది అనేది కూడా చాలా ముఖ్యం. ఏ మార్గం ప్రభావితం కావచ్చు మరియు ఏ మెట్రో స్టేషన్ మూసివేయబడుతుంది.