NTV Telugu Site icon

Kishan Reddy : జమ్మూ & కాశ్మీర్‌కు బీజేపీ ఇంచార్జ్ గా కిషన్ రెడ్డి..

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy : కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి సోమవారం జమ్మూకశ్మీర్‌ ఎన్నికల ఇంఛార్జిగా నియమితులయ్యారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ తో పాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా పార్టీ ఎన్నికల ఇంచార్జ్‌లు, కో – ఇన్‌చార్జ్‌ లను నియమించారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌ లలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, జమ్మూ కాశ్మీర్‌లో సెప్టెంబర్‌ లోగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

Viral Video: తాత, బామ్మ ఎవ్వారం మాములుగా లేదుగా.. కెటిఎమ్ బైక్ పై రయ్.. రయ్.. అంటూ

బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌ ను మహారాష్ట్ర ఇంచార్జిగా నియమించగా.., కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ రాష్ట్రానికి కో – ఇంఛార్జిగా వ్యవహరిస్తారని పార్టీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే హర్యానాకు బీజేపీ ఎన్నికల ఇంచార్జిగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇంకా కో-ఇంఛార్జిగా త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ నియమితులయ్యారు. ఇక మరోవైపు మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ జార్ఖండ్‌ ఎన్నికల ఇంచార్జిగా, ఉండగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాష్ట్రానికి కో-ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారని తెలిపింది.

Nisha Kothari : ఓరి దేవుడో .. ఆర్జీవి హీరోయిన్ ఇలా మారిందేంటి?